ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతుంది.ఇలా పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అంటూ ఇతర భాష సెలబ్రిటీలకు కూడా మరొక భాషలో ఎంతో సక్సెస్ అందుకుంటున్నారు.
ఇక మన తెలుగు సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఏర్పడిన నేపథ్యంలో ఇతర భాష హీరోలు కూడా తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే.ఇలా పాన్ ఇండియా సినిమాలలో ఇతర భాష సెలబ్రిటీలు అందరూ కూడా భాగమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే ఇప్పటికే తెలుగులో బిగ్గెస్ట్ మల్టీ స్టార్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఎన్టీఆర్ నటించిన RRR సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో మనకు తెలిసిందే.అయితే తాజాగా రాంచరణ్ మరొక హీరోతో కలిసి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో హీరో ధనుష్( Dhanush ) ఒకరు.
ఈయన కేవలం హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ధనుష్ తో కలిసి రామ్ చరణ్ సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఇది మల్టీ స్టారర్ సినిమానా.లేక ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుందా అనే విషయానికి వస్తే.గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కు ఓ మాస్ సబ్జెక్ట్ లైన్ చెప్పాడంట ధనుష్.
ఆ లైన్ చరణ్ కి కూడా తెగ నచ్చేసిందట.దీంతో ధనుష్ చరణ్ కాంబోలో, ధనుష్ దర్శకుడిగా సినిమా రాబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఇదే కనుక నిజమైతే కోలీవుడ్, టాలీవుడ్ బాక్సాఫిస్ షేక్ అవ్వడం ఖాయమంటున్నారు.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది( Peddi ) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.