జమ్ముకశ్మీర్‌లోని 22 జిల్లాల్లో ఒక జిల్లా అయిన రిసీ జిల్లాలో శివఖోరి అనే ఓ శివాలయం ఉంది.చుట్టూ పాల సముద్రాన్ని తలపించే మంచు కొండలు, పచ్చని చెట్లతో పరుచుకున్న అందాలు, కళ్లు తిప్పుకోలేని కాశ్మీర్ సౌందర్యం.
ఆ ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది.అది ఏంటో ఒకసారి చూద్దాం.
1.ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్ లోని రిషి జిల్లాలో ఉంది.ఈ ఆలయాన్ని శివఖోరి అని పిలుస్తారు.ఖోరి అంటే గుహ.
2.నిజానికి ఇది ఆలయం అన్న పేరే కాని అసలు అలా కనిపించదు.గుహలా ఉంటుంది.ఈ గుహలోనే పరమశివుడు కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం.
3.200 మీటర్ల పొడవుండే ఈ గుహలో శివలింగం స్వయంగా రూపుదిద్దుకుంది అంట.
4.ఆలయంలో ఎప్పుడూ రెండు పావురాలు ఉంటాయని, అవి పుణ్యం చేసిన వారికి మాత్రమే కనిపిస్తాయని అంటారు.
5.ఆలయ పైభాగంపై పాముల ఆకారాలు ఉంటాయి.చుట్టూ పార్వతి, వినాయకుల ఆకారాలు కూడా కనిపిస్తాయి.
6.ఆలయ పైభాగం నుండి వచ్చే నీరు నేరుగా శివలింగం పై నిత్యం పడుతూనే ఉంటుంది.
7.ఇక ఈ గుహ నుంచి అమర్‌నాథ్‌కు వెళ్లే మార్గం కూడా ఉంది.ఇంతకు ముందు ఒకసారి శివ భక్తులుగా పిలువబడే అఘోరాలు, సాధువులు ఈ మార్గం గుండానే అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారట.
8.అయితే అలా వెళ్లిన వారెవరూ అక్కడికి చేరుకోపోగా, తిరిగి రానుకూడా లేదు.వారు ఏమైపోయారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
9.వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో గుహలోపలికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు.
10.కేవలం మహాశివరాత్రికి మూడు రోజుల ముందు మాత్రమే శివఖోరి ఆలయాన్ని తెరుస్తారు.
11.ఈ ఆలయాన్ని బయట నుంచి చూసేవారే కానీ లోపలికి అడుగుపెట్టాలంటే భయపడుతుంటారు భక్తులు.
12.సృష్టిలో ఎన్నో చిత్రాలు, మరెన్నో వింతలు.అందులో శివఖోరి ఆలయం ఒకటి.
ఈ ఆలయానికి 50 ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ 2000 నుండి మాత్రమే భక్తులకు తెలిసింది.
DEVOTIONAL