సాధారణంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో ఆచారాలు పాటిస్తూ ఉన్నాము.అదేవిధంగా వారంలో ప్రతి రోజు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.
వారంలో వచ్చేటటువంటి కొన్ని రోజులలో కొన్ని పనులు చేయకుండా ఉండడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.ఈ తరహాలోనే మంగళవారం, శుక్రవారం ఇతరులకు డబ్బు ఇవ్వరాదని, ఉప్పు దానంగా ఇవ్వరాదని వంటి విషయాలు చెబుతూ ఉంటారు.
అదేవిధంగా గురువారం కూడా కొందరు కొన్ని పనులను అసలు చేయకూడదు చెబుతుంటారు.పొరపాటున గురువారం రోజు కొన్ని పనులు చేస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అని ఆధ్యాత్మిక క పండితులు చెబుతున్నారు.
గురువారం ఎలాంటి పనులు చేయకూడదు ఇక్కడ తెలుసుకుందాం….
గురువారం సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి ప్రతిబింబమైన, బృహస్పతికి ఎంతో ప్రీతికరమైన రోజు.
అందువల్ల గురువారం ఎంతో పరమ పవిత్రంగా భావించి కొన్ని నియమ నిబంధనలను పూర్వం మన పెద్దలు ఆచరించేవారు.గురువారం బృహస్పతి కి ఇష్టమైన రోజు కాబట్టి గురుడు భర్తను ప్రతిబింబిస్తాడు.
అందువల్ల గురువారం మహిళలు తలంటు స్నానం చేయకూడదు.ఒకవేళ చేస్తే భర్త, పిల్లలకు మంచిది కాదని చెబుతున్నారు.
అదేవిధంగా గురువారం గోళ్లను, జుట్టు కత్తిరించకూడదు.ఈ విధంగా గురువారం చేస్తే పరమ దరిద్రాలు అంటుకుంటాయి.

కొంతమంది ఇంట్లో బూజు దులిపి ఇంటిని శుభ్రం చేస్తుంటారు.కానీ గురువారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో బూజు దులుపకూడదని పండితులు చెబుతున్నారు.అదే ఈ విధంగా గురువారం లక్ష్మీదేవికి పూజ చేయడం ఎంతో శుభకరం.అయితే గురువారం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి లక్ష్మీ ఫోటో తో సహా ఆ నారాయణుడు ఉన్న ఫోటోను పూజించడంవల్ల సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
గురువారం రోజు అద్దాలు, కత్తులు వంటి పదునైన వస్తువులను కొనుగోలు చేయడం మంచిది కాదు.గురువారం భూములు వంటివి కొనడం ఎంతో అదృష్టంగా పరిగణిస్తారు.గురువారం మా ఇంటికి ఎవరైనా సాధువులు వస్తే తప్పకుండా వారికి ఆహారం పెట్టి పంపించాలి.అదేవిధంగా పక్షులు, జంతువులులకి ఆహారం పెట్టాలి.
అదేవిధంగా గురువారం పూజ చేసే సమయంలో విష్ణు సహస్రనామం చదువుతూ పూజలు నిర్వహించడం వల్ల బృహస్పతి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు.