గురు రామ్ దాస్ సిక్కుల నాలుగో గురువు.ఆయనే చారిత్రక కట్టడమైన అమృత్ సర్ పట్టణాన్ని నిర్మించారు.
తన గురువైన గురు అర్జున్ దేవ్ ఆదేశాలకు అనుగుణంగా గురు రామ్ దాస్ అమృత్ సర్ ను నిర్మించారు.రామ్ దాస్ చాలా నిరాడంబరుడు, ఆయన చాలా వినయంగా ఉండేవారు.
ఇతరులతో ఆయన ఎంతో సౌమ్యంగా మాట్లాడేవారు.ఆయన గురించి ఈనోటా ఆనోటా విన్న గురు నాననక్ కొడుకు బాబా శ్రీచంద్ ఆయనను కలిసేందుకు అమృత్ సర్ వెళ్లారు.
తనను కలవడానికి 90 ఏళ్ల శ్రీచంద్ రావడం గురించి తెలుసుకున్న గురు రామ్ దాస్ ఎంతో సంతోషించారు.
గురునానక్ కుమారుడు శ్రీచంద్ ను అమృత్ సర్ లో ఘనంగా స్వాగతించారు రామ్ దాస్.
ఆయనకు ఎదురువెళ్లి శ్రీచంద్ ను సాదరంగా స్వాగతించారు.తనను స్వాగతించిన తీరు, ఆయన ప్రవర్తన, అక్కడి పరిస్థితులు నిశితంగా గమనించిన శ్రీచంద్… గురు రామ్ దాస్ గురించి ఇతరులు చెప్పుకునే దాంట్లో పల్లెత్తు మాట కూడా అవాస్తవం లేదని గ్రహించారు.
వాళ్లిద్దరూ అనేక అంశాల గురించి మాట్లాడుకున్నారు.చాలా విషయాలపై లోతైన చర్చ చేశారు.
చివరగా.నాయనా రామ్ దాస్ అంతా బానే ఉంది కానీ, నువ్వు ఇంత పొడవైన గడ్డం ఎందుకు పెంచావు అని శ్రీచంద్ నవ్వుతూ రామ్ దాస్ ను అడిగారు.
గురు రామ్ దాస్ కూడా నవ్వి… స్వామి మీ వంటి పుణ్యాత్ములు, దైవ సేవకులు వచ్చినప్పుడు శిరస్సు వంచి, పాదాలకు అంటుకున్న దుమ్మును, ధూళిని శుభ్రం చెయ్యాలంటే గడ్డం పొడుగ్గానే ఉండాలిగా మరి అంటూ వినమ్రంగా జవాబు ఇచ్చారట గురు రామ్ దాస్.ఆ మాటలతో ప్రసన్న వదనంతో రామ్ దాస్ వంక చూసిన శ్రీచంద్ కు తండ్రి గురునానకే కనిపించారు.