ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు, అధికారం ఏ పార్టీకి సొంతమయ్యే అవకాశం ఉందనే ప్రశ్నకు వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్రంలో పోల్ మేనేజ్ మెంట్, ఇతర అంశాలను పరిశీలిస్తే ఈ విషయాలు సులువుగా అర్థమవుతున్నాయి.
ఐదేళ్ల పాటు ఏపీకి జగన్ ( AP CM YS JAGAN ) సీఎంగా ఉండగా మరో ఐదేళ్లు కూడా ఆయనే సీఎంగా కొనసాగే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రూరల్, అర్బన్ ఏరియాలలో పథకాల ప్రయోజనాలు పొందిన వాళ్లంతా మళ్లీ జగన్ నే గెలిపించుకుంటామని చెబుతున్నారు.వైసీపీ అభ్యర్థులు పట్టు విడవకుండా చివరి నిమిషం వరకు ప్రచారం చేయడం పార్టీకి కలిసొచ్చింది.జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రమే ఇప్పటివరకు అమలైన పథకాలు కొనసాగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
వృద్ధులు, మహిళలు రాష్ట్రంలో క్యూలైన్లలో బారులు తీరుతున్నారు.
వృద్ధులు, మహిళలు రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అందువల్ల రాష్ట్రంలో వైసీపీ సులువుగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది.రాష్ట్రంలో వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆ నియోజకవర్గాల్లో వైసీపీకి చెక్ పెట్టే అవకాశం అయితే లేదని తెలుస్తోంది.ప్రతి జిల్లాలో సగానికి పైగా సీట్లు వైసీపీకే వస్తాయని తెలుస్తోంది.
కూటమికి, వైసీపీకి టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ భావించినా ఎన్నికల సమయానికి పరిస్థితులు అన్నీ మారిపోయాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఈసారి జగన్ ప్రధానంగా అభివృద్ధిపై ఫోకస్ చేయనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో వార్ వన్ సైడ్ అని ఫిక్స్ కావచ్చని తెలుస్తోంది.జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలు సైతం వైసీపీకే అనుకూలంగా ఉండబోతున్నాయని ఇందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.