సినిమా నటీనటులకు నట్లు , బోల్టులు బిగిస్తాం.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు వైరల్!

బెంగళూరు(Bangalore) నగరంలో జరుగుతున్న చలన చిత్రోత్సవం కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో శాండిల్ వుడ్ నటీనటులు పాల్గొనలేదు.కన్నడ నటీనటులు ఈ విధంగా చేయడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(deputy cm shivakumar) ఫైర్ అయ్యారు.

 Deputy Cm Shivakumar Comments Goes Viral In Social Media Details Inside , Deputy-TeluguStop.com

విధాన సౌధలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న శివకుమార్ కన్నడ భూమి, భాష గురించి నటీనటులు స్పందించని పక్షంలో నట్లు, బోల్ట్ లను టైట్ చేస్తామని చెప్పారు.

ఈ కామెంట్లు నెట్టింట హట్ టాపిక్ అవుతున్నాయి.

ఈ కామెంట్లను డీకే శివకుమార్(DK Shivakumar) సమర్థించుకున్నారు.సినిమా ప్రముఖులు ఏది కావాలంటే అది చేసుకోవచ్చని నాకు తెలియదని ఆయన తెలిపారు.

నా మాటల్లో నిజాలు ఉన్నాయని ధర్నాలు చేసినా పరవాలేదని ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.కర్ణాటకకు అన్యాయం జరిగిన సమయంలో ఇండస్ట్రీ నుంచి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు.

Telugu Bangalore, Deputy Cm, Deputycm, Dk Shivakumar, Kumbh Mela-Movie

మన నీరు, మన హక్కు పోరాటంలో సినిమా వాళ్లెవరూ పాల్గొనలేదని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు.మేకెదాటు పాదయాత్రలో నటీనటులు పాల్గొన్న సమయంలో బీజేపీ (BJP)సర్కార్ కేసులు వేసిందని ఆయన చెప్పుకొచ్చారు.కుంభమేళాలో (Kumbh Mela)స్నానం చేయడం గురించి సొంత పార్టీ నేతలు విమర్శలు చేశారని ఆ నీటికి కులం మతం ఉందా ఏదైనా పార్టీకి చెందిందా అని ఆయన చెప్పుకొచ్చారు

Telugu Bangalore, Deputy Cm, Deputycm, Dk Shivakumar, Kumbh Mela-Movie

అయితే డిప్యూటీ సీఎం శివకుమార్ కామెంట్లపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు నరసింహులు డీకే శివకుమార్ కామెంట్లను ఖండించారు.కొంతమందికి ఆహ్వానం అందలేదని ఆహ్వానం అందకపోతే ఎలా అటెండ్ అవుతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.డిప్యూటీ సీఎం శివకుమార్ తన కామెంట్ల విషయంలో వెనక్కు తగ్గుతారేమో చూడాలి.డిప్యూటీ సీఎం కామెంట్ల విషయంలో కొంతమంది నటీనటులు ఫైర్ అవుతున్నారని తెలుస్తోంది.ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube