ఇటీవలే అద్భుతమైన విజువల్ వండర్ తో ప్రేక్షకులందరినీ అబ్బురపరిచిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గొప్ప టెక్నీషియన్స్ అందర్నీ కూడా ఒక చోట చేర్చి భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా బ్రహ్మాస్త్ర.ఇది ఏకంగా హాలీవుడ్ మూవీ అవెంజర్స్ తరహాలోనే బ్రహ్మాస్త్ర సినిమా తెరకెక్కింది అని చెప్పాలి.
భారతీయ పురాణ సారాన్ని ఇక ఈ సినిమా రూపంలో చెప్పాలని అనుకున్నారు.సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులని కూడా మంత్రముగ్ధుల్ని చేసేస్తూ ఉంటాయ్ అని చెప్పాలి.
సినిమా మొదలవ్వగానే వయసు అయిపోయింది కదా అందుకే నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు అంటూ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చెప్పే డైలాగు తో మొదలయ్యే సినిమా ప్రేక్షకులను ఒక్కసారిగా అంచనాలను పెంచేస్తూ ఉంటుంది.ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులను అబ్బుర పరుస్తుంది.
ఈక్రమంలోనే యుగాల నుంచి హిందూ ధర్మం ఎలా నిలిచింది అన్న విషయాన్ని కూడా ఈ సినిమాలో చూపించారు.సినిమాలోని ట్విస్టులు కూడా ప్రేక్షకులను మునివేళ్ళ పై నిలబెట్టాయి.

అయితే రణబీర్ కు తల్లిగా చేసింది దీపిక నేనని దృఢమైన దేవ్ పాత్రలో కనిపించింది రణవీర్ సింగే అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది.దీన్ని బట్టి ఇక ఈ సినిమా రెండవ పార్ట్ లో దీపిక రణవీర్ ల గురించి ఉంటుంది అన్నది అందరూ అనుకుంటున్నారు.ఇలా కమర్షియలిటీ మరోవైపు షారుక్ ఖాన్.యూత్ కోసం అలియాభట్ అందాలు పెద్దోళ్ళు కోసం సనాతన సెంటిమెంట్.పిల్లల కోసం విజువల్ వండర్ ఇక ఫ్యామిలీ అందరినీ కూడా సినిమా చూడాలి అనిపించేలా ఉండే ఒక మంచి కథ ఇక ఇలా బ్రహ్మాస్త్ర సినిమాలోని అన్ని కూడా ప్లస్ పాయింట్లే అన్నది తెలుస్తుంది.ఇక సినిమా సూపర్ హిట్టయ్యింది.