కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా వస్తున్న సినిమా దొంగలున్నారు జాగ్రత్త.ఈ సినిమాని సతీష్ డైరెక్ట్ చేస్తున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.ఇక ట్రైలర్ విషయానికి వస్తే తెలివిగా కార్ కీస్ ఓపెన్ చేసిన హీరో అందులో ఇరుక్కుపోతాడు.
అతను కారుని దొంగతనం చేద్దామని అనుకుంటే ఎవరో అతన్ని ట్రాప్ చేసి అందులో ఇరుక్కునేలా చేస్తారు.ఇంతకీ దీని వెనక ఉన్న కథ ఏంటి ఆ కారులో నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడు అన్నదే సినిమా కథ.
ఈ సినిమా ట్రైలర్ మొత్తం ఒక కారులోనే ఉంచారు.అంటే సినిమా కూడా దాదాపు కారులోనే అది కూడా ఒక్క హీరో ఒక్క పాత్రే మెయిన్ గా కనబడుతుందని చెప్పొచ్చు.
ఇక సినిమాలో ప్రీతి ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా సముద్రఖని ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.సినిమాకు కాళ భైరవ మ్యూజిక్ అందిస్తున్నారు.ఫస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ నెల 23న సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు మేకర్స్.







