యూఏఈలో భారతీయ మహిళకు మరణశిక్ష అమలు .. చివరి కోరిక ఇదే

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో( UAE ) భారత్‌కు చెందిన ఓ మహిళకు అక్కడి ప్రభుత్వం మరణశిక్షను( Death Penalty ) అమలు చేసింది.తన సంరక్షణలో ఉన్న పసిబిడ్డ మృతి కేసులో ఆమెకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించగా , ఆమెను కాపాడేందుకు కుటుంబం, భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

 Indian Woman From Up Executed In Uae For Infant’s Death Case, Indian Woman ,up-TeluguStop.com

చివరికి ఫిబ్రవరి 15న యూఏఈ ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) బాందా జిల్లా ముగ్లికి చెందిన షెహజాదిని( Shahzadi ) 2021లో ఉజైర్ అనే వ్యక్తి యూఏఈ తీసుకెళ్తానని తనకు బంధువులైన ఫైజ్ – నాడియ దంపతులకు విక్రయించాడు.

దీంతో వారు షెహజాదిని అబుదాబీకి( Abu Dhabi ) తీసుకెళ్లి తమ బిడ్డ బాగోగులను చూసుకునే పనులు అప్పగించారు.అయితే 2022 డిసెంబర్ 7న ఆ చిన్నారి చనిపోవడంతో దీనికి షెహజాదీయే కారణమని ఫైజ్ – నాడియాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో యూఏఈ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.న్యాయస్థానం షెహజాదీకి మరణశిక్ష విధించింది.

Telugu Abu Dhabi, Indian, Shahzadi Khan, Shahzadikhan-Telugu NRI

ఈ విషయం యూపీలోని షెహజాదీ తండ్రి షబ్బీర్ ఖాన్‌కు తెలియడంతో ఆయన కుమార్తెను కాపాడాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు.తనకు త్వరలోనే మరణశిక్ష అమలు చేస్తారని ఈ ఏడాది ఫిబ్రవరి 14న షెహజాదీ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది.దీంతో భయాందోళనలకు గురైన షబ్బీర్.తక్షణం ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేశారు.

Telugu Abu Dhabi, Indian, Shahzadi Khan, Shahzadikhan-Telugu NRI

అయితే ఆ తర్వాత తన కుమార్తె ప్రాణాలతో ఉందా ? లేదా ? అనేది తెలుసుకోవడానికి ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.అయితే ఎవ్వరూ ఊహించని విధంగా షెహజాదీని ఫిబ్రవరి 15న యూఏఈలో ఉరితీశారని అదనపు సొలిసిటర్ జనరల్ న్యాయస్థానానికి చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఇది ఎంతో దురదృష్టకరమని న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

అయితే మరణశిక్షకు ముందు నీ చివరి కోరిక( Last Wish ) ఏంటని యూఏఈ జైలు అధికారులు షెహజాదీని అడగ్గా తన కుటుంబంతో మాట్లాడాలని ఉందని చెప్పింది.

దీంతో అధికారులు ఫోన్‌లో మాట్లాడించారు.ఆ సమయంలో తాను ఏ తప్పు చేయలేదని, తనను రక్షించమని కుటుంబ సభ్యులను వేడుకుంది.అయినప్పటికీ షెహజాదీకి ఉరిశిక్ష తప్పలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube