అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( US President Donald Trump ) బాధ్యతలు స్వీకరించిన తర్వాత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు .అక్రమ వలసదారులను( Illegal Migrants ) దేశం నుంచి బహిష్కరించడంతో పాటు ఇమ్మిగ్రేషన్ విషయంలో కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు.
ఉక్రెయిన్ – రష్యా యుద్ధాన్ని ముగింపు దశకు తీసుకొచ్చిన ట్రంప్.జెలెన్‌స్కీతో తాడోపేడో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇక కెనడా, మెక్సికో, చైనాలపై భారీగా పన్నులు విధించిన ట్రంప్ మరింత దూకుడుగా వెళ్తున్నారు.
అయితే కెనడాపై( Canada ) ట్రంప్ పన్నుల పెంపు వ్యవహారం భారత్‌పై( India ) ముఖ్యంగా అక్కడ చదువుకోవడానికి వెళ్లే విద్యార్ధులపై పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ట్రంప్ పరిపాలనా యంత్రాంగం అమలు చేస్తున్న ఈ అధిక పన్నుల వల్ల అవసరమైన వస్తువులు, సేవల ధర పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.అంతర్జాతీయ విద్యార్ధుల( International Students ) ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు, ఉద్యోగ అవకాశాలపై ఇది ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు.

కెనడా, మెక్సికోల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే.కెనడియన్ ఇంధన ఉత్పత్తులపై అదనంగా 10 శాతం పన్ను విధించబడుతుందని అమెరికా తెలిపింది.ఇది విద్యార్ధులకు ముఖ్యంగా, కఠినమైన కెనడియన్ శీతాకాలంలో విద్యుత్ సహా యుటిలిటీ ఖర్చులను పెంచే అవకాశం ఉంది.వాణిజ్య అంతరాయాలు, సరఫరా గొలుసులను ప్రభావితం చేస్తున్నందున ఆహార ధరలు కూడా పెరగవచ్చు.
కెనడా వివిధ ఆహార ఉత్పత్తుల కోసం అమెరికా, మెక్సికో దిగుమతులపై ఆధారపడుతుంది.ఇప్పుడు సుంకాలు అమలులో ఉన్నందున కిరాణా బిల్లులు పెరగవచ్చు.
దీని వలన విద్యార్ధులు తమను తాము పోషించుకోవడం ఖరీదైనదిగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కెనడాలోని అంతర్జాతీయ విద్యార్ధులు తరచుగా ఖర్చులను నిర్వహించడానికి పార్ట్ టైమ్ ఉద్యోగాలపై ఆధారపడతారు.అయితే కెనడియన్ ఆర్ధిక వ్యవస్ధపై యూఎస్ సుంకాల ప్రభావం నేపథ్యంలో వ్యాపారాలు నియామకాలను తగ్గించవచ్చు లేదా వేతనాలను నిలిపివేయవచ్చు.ఈ సుంకాలు ఉద్యోగ నష్టాలు, ఆర్ధిక విపత్తుకు దారి తీయవచ్చని కెనడియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే హెచ్చరించింది.







