ముఖ చర్మం తరచూ డ్రైగా మారిపోతుందా.. అయితే ఈ రెమెడీ మీ కోసమే!

వింటర్ సీజన్ లో చర్మం పొడిబారడం సర్వసాధారణం.కానీ కొందరికి సీజన్ తో పని లేకుండా చర్మం డ్రై గా మారుతుంటుంది.

 This Remedy Helps To Get Of Dry Skin Naturally! Home Remedy, Skin Care, Skin Car-TeluguStop.com

ముఖ్యంగా ముఖ చర్మం తరచూ పొడిబారిపోతుంటుంది.ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలో తెలియక తెగ మదన పడిపోతుంటారు.

అయితే వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే డ్రై స్కిన్ కు సులభంగా చెక్ పెట్టవచ్చు.

చర్మాన్ని మృదువుగా కోమలంగా మెరిపించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక పల్చటి వస్త్రాన్ని తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు( curd ) వేసి వాటర్ ను ఎక్స్ట్రాక్ట్ చేయాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నీరు తొలగించిన పెరుగును వేసుకోవాలి.

అలాగే వ‌న్‌ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder ), వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ) వేసి అన్నీ కలిసేంతవరకు స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Dry Skin, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Smooth Skin, S

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.చివ‌రిగా ఏదైనా మంచి మాయిశ్చరైసర్ ను చర్మానికి అప్లై చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు ఈ రెమెడీని కనుక పాటిస్తే డ్రై స్కిన్ అన్న మాటే అనరు.

Telugu Tips, Dry Skin, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Smooth Skin, S

ఈ రెమెడీ చర్మాన్ని కోమలంగా, మృదువుగా రావడానికి ఎంతో బాగా సహాయపడుతుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మం పై మొండి మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా మాయం అవుతాయి.

పిగ్మెంటేషన్ సమస్యను నివారించడానికి సైతం ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube