అసలే సమ్మర్ సీజన్.ఎండలు ఏ రేంజ్ లో మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ ఎండల కారనంగా దెబ్బకు ఒంట్లో ఓపిక మొత్తం మధ్యాహ్నానికే ఆవిరి అయిపోతుంటుంది.దీంతో పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది.
అందుకే చాలా మంది రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలని భావిస్తుంటారు.అది సాధ్యమా అంటే సాధ్యమే.
అందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ అద్భుతంగా సహాయపడుతుంది.మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని కనుక చేరిస్తే రోజంతా మీరు ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.
నీరసం అలసట వంటివి మీ దారి దాపుల్లోకి కూడా రావు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మూడు లేదా నాలుగు స్ట్రాబెర్రీ పండ్లు( Strawberry fruits ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక మామిడి పండును తీసుకుని లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో మ్యాంగో పల్ప్ మరియు కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ ముక్కలు వేసుకోవాలి.

అలాగే ఐదు నైట్ అంతా వాటర్ లో నానబెట్టిన జీడిపప్పు ( cashew nut )మరియు ఒక గ్లాసు హోమ్ మేడ్ బాదం పాలు( Almond milk ) పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న స్ట్రాబెర్రీ మ్యాంగో స్మూతీలో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న చియా సీడ్స్ ( Chia seeds )వేసి తీసుకోవడమే.ఈ స్ట్రాబెర్రీ మ్యాంగో స్మూతీని ప్రస్తుత వేసవికాలంలో బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉండడానికి కావాల్సినంత ఎనర్జీ లభిస్తుంది.

దాంతో నీరసం అలసట వంటివి మిమ్మల్ని వేధించకుండా ఉంటాయి.రోజంతా ప్రతి పనిలో చాలా చురుగ్గా పాల్గొంటారు.అంతేకాదు ఈ స్మూతీని తీసుకోవడం వల్ల అతి ఆకలి దూరం అవుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.
మరియు మీ స్కిన్ గ్లోయింగ్ గా షైనీ గా సైతం మెరుస్తుంది.