తల్లికి తగ్గట్టు కూతురు అనిపించుకున్న జాన్వీ కపూర్( Janhvi Kapoor ).కొరటాలకే కండిషన్ పెట్టిందిగా?
ఒకప్పటి అందాల తార శ్రీదేవి( Sridevi ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.అంతేకాకుండా తన అందాలతో ప్రతి ఒక్కరు తన వైపుకు తిప్పుకుంది.అటువంటి తార ఈ లోకానికి దూరమైన కూడా ఇప్పటికి ప్రేక్షకులు ఆమెను ఏదో ఒక విధంగా గుర్తుకు చేసుకుంటేనే ఉంటారు.
శ్రీదేవి ఈ లోకానికి దూరమైనా కూడా తన వారసులను మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేసింది.
అందులో తన పెద్ద కూతురు జాన్వీ కపూర్ మాత్రం ఇప్పుడు బాలీవుడ్ ని ఏలేస్తుంది.తల్లి కోరిక తీర్చిన ఈ ముద్దుగుమ్మ తల్లికి తగ్గట్టుగా పేరు సంపాదించుకుంటుంది.
చాలా వరకు శ్రీదేవి ఆలోచనలు జాన్వీ ఆలోచనలు ఒకేలా ఉంటాయి.అప్పట్లో శ్రీదేవి ఏదైనా సినిమాలలో చేసినప్పుడు తన పాత్రకు సంబంధించిన విషయంలో కండిషన్స్ బాగా పెట్టేదట.

ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా అలాగే కండిషన్స్ పెట్టిందని తెలిసింది.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.జాన్వీ ధడక్ సినిమాతో తొలిసారిగా పరిచయం కాగా తొలి నటనతోనే దర్శక నిర్మాతలను మెప్పించింది.ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని స్టార్ హోదాకు చేరుకుంది.ఇక టాలీవుడ్ కు కూడా ఎన్టీఆర్ సినిమాతో( movie with NTR ) తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడానికి సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో దేవర అనే సినిమాలో( Koratala movie Devara ) నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంచుకున్నాడు కొరటాల.అయితే మొదట కొరటాల శివ జాన్వీ కపూర్ కు ఈ కథ చెప్పినప్పుడు వెంటనే జాన్వీ ఫిదా అయ్యిందట.
కానీ ఆ సమయంలో జాన్వీ కొరటాలకు ఒక కండిషన్ పెట్టిందట.
అంటే ఇందులో జాన్వీ పాత్ర చనిపోతుందని కొరటాల రాసుకున్నాడట.
దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ఫస్ట్ సినిమాతోనే ఇలా చనిపోయే రోల్ లో కనిపిస్తే సెంటిమెంట్ గా భావించిన జాన్వీ.తన పాత్ర చనిపోకుండా ఉండేలా కథను మలచమన్నిందట.
అప్పుడే సినిమాకు సైన్ చేస్తానని కొరటాలకు కండిషన్ పెట్టిందట.

ఇక జాన్వీ చెప్పిన మాటలు విని కొరటాల కూడా తను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని స్క్రిప్ట్ మార్చి ఆమె పాత్రను బ్రతికించాడట.గతంలో శ్రీదేవి కూడా చాలా సినిమాల్లో ఇటువంటి కండిషన్స్ పెట్టిందట.సినిమాలలో తనకు కూడా చనిపోయే పాత్రలో అవకాశం వస్తే వెంటనే డైరెక్టర్లతో తన పాత్రను చనిపోకుండా ఉండాలి అని కోరేదట.
ఇప్పుడు జాన్వీ కూడా తల్లి లాగా ఆలోచించడంతో తల్లికి తగ్గట్టు కూతురు అని నిరూపించుకున్నావ్ కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న జాన్వీ కపూర్ వారిని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
ఒకవేళ ఈ సినిమా తనకు మంచి సక్సెస్ అందిస్తే ఆ తర్వాత ఈమెకు వరుస అవకాశాలు రావటం ఖాయమని చెప్పాలి.