ఉదయం లేవగానే చేయవలసిన పనులు ఇవి

ఉదయం లేవగానే మన శరీరం పట్ల శ్రద్ధ వహించడం అవసరం.నిద్ర ముగించాక ఏం చేయాలో, బ్రేక్ ఫాస్ట్ కి ముందువరకు ఎలాంటి కసరత్తులు చేయాలో చాలామందికి తెలియని విషయాలు.

 Things One Must Do Before Breakfast-TeluguStop.com

అందుకే ఉదయం లేవగానే ఎలాంటి కసరత్తులు చేయాలో ఇప్పుడు చెబుతున్నాం చూడండి.

* మొదటగా, ఉదయం 5:30 – 6:00 గంటల లోపు నిద్రలేచే విధంగా 7-8 గంటల నిద్ర ప్లాన్ చేసుకోండి.

* కొన్నిగంటల పాటు విశ్రాంతి తీసుకున్న మీ శరీరాన్ని కొంచెం స్ట్రెచ్ చేయండి నిద్రలేవగానే.ఆ చిన్నిపాటి వ్యాయామం బాడి లో బ్లడ్ ఫ్లో పెంచుతుంది.అలాగే రెండుమూడు ఉల్లిపాయలు తినండి.

* ఒకటి లేదా రెండు గ్లాసుల మంచినీరు తాగండి.

ఏడెనిమిది గంటల పాటు నీరు లేని శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలి.

* మరోగ్లాసు నిమ్మరసం తాగండి.

శరీరంలో టాక్సిన్స్ ని ఉదయాన్నే బయటకి తీసేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఆ తరువాత మలమూత్ర విసర్జన చేయండి.

* ఆ తరువాత గ్రీన్ టీ లేదా అల్లం టీ తీసుకోండి, కాఫీ అలవాటు మాడరేట్ గా ఉంటే మీ ఇష్టం.

* ఉదయాన్నే 7 గంటల నుంచి 7:30 లోపు మీ బ్రేక్ ఫాస్ట్ ని ముగించే ప్రయత్నం చేయండి.ఈ అలవాటే మంచిది.ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ లేకుండా, కుదిరితే, గ్రీన్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ లేదంటే ఇంట్లో దొరికే ఇడ్లీ ఉత్తమం.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు