1.రేపు ఎన్డీఏ నేతల కీలక భేటీ
రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు ఎన్డిఏ కీలక సమావేశం ఏర్పాటు చేసింది.
2.ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి తెలంగాణా కు రాక

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము వివిధ రాజకీయ పార్టీల మద్దతు కోరే నిమిత్తం 12వ తేదీన తెలంగాణకు రానున్నారు.
3.వైసిపి శాశ్వత అధ్యక్షుడి గా జగన్
వైసిపి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికయ్యారు.ఈ మేరకు పార్టీ ప్లీనరీ లో తీర్మానం చేశారు.
4. భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 18,840 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.విద్యాలయాలకు నాణ్యమైన బియ్యమే సరఫరా చేయాలి
విద్యాలయాలకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యంగా ఉండేలా చూడాలని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అధికారులకు సూచించారు.
6.కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో జరిగింది.
7.ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచిన టాటా
టాటా మోటార్స్ అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచింది.పెంచిన ధరలు శనివారం నుంచి అమల్లోకి రాబోతున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది.
8.కోడి కత్తి కేసు .సీజేఐ కి నిందితుడి తల్లి లేఖ

జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు తల్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఈ రోజు లేఖ రాశారు.తన కుమారుడిని వెంటనే విడుదల చేయాలని, ఈ కేసు పై సీబీఐ విచారణ చేయించాలని లేఖలో కోరారు
9.అమర్నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం యాత్రికుల గల్లంతు
అమర్నాథ్ యాత్ర కు వెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కు చెందిన దాదాపు 20 కుటుంబాలకు చెందిన యాత్రికులు చిక్కుకున్నారు.వీరిలో ఎక్కువ మంది గల్లంతయినట్లు సమాచారం.
10.ముమ్మర వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్త

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.సంబంధిత శాఖల అధికారులు అలర్ట్ గా ఉంటూ, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
11.పంట కాలువలను శుభ్రం చేసిన జనసేన
కాకినాడ రూరల్ గంగనాపల్లి పంట కాలువలో గుర్రపు డెక్క ను జనసేన నాయకులు , కార్యకర్తలు కలిసి తొలగించి రైతులకు ఇబ్బందులు లేకుండా చేశారు.
12.పవన్ కళ్యాణ్ కామెంట్స్

ప్రత్తిపాడు నియోజకవర్గం గోపాలపురం లో కాగితం ప్లేట్ లపై అంబేద్కర్ బొమ్మలను వేయడాన్ని ప్రశ్నించిన ఎస్సీ యువకులను వేధించడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు.
13.పులిని బంధించేందుకు ప్రయత్నాలు
అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తూ పశువులపై దాడి చేసి చంపేస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
14.రైస్ మిల్లర్లను కెసిఆర్ మోసం చేశారు : బండి సంజయ్

రైస్ మిల్లర్లను కెసిఆర్ మోసం చేశారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
15.ఒంటరిగానే పోటీ చేస్తా : షర్మిల
తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే ఎన్నికలలో పోటీ చేస్తుందని వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు.
16.అమర్నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన జనగామ వాసులు

అమర్నాథ్ యాత్రలో తెలంగాణలోని జనగామ వాసులు చిక్కుకుపోయారు.మొత్తం నలుగురు వెళ్లగా అందులో తాండూరి రమేష్ సత్యనారాయణ సురక్షితంగా ఉన్నట్టు గా కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, మరో ఇద్దరు ఆచూకీ తెలియాల్సి ఉంది.
17.20 వరకు కాచిగూడ నిజామాబాద్ రైళ్ల రద్దు
కాచిగూడ నిజామాబాద్ మధ్య నడిచే రైళ్ళను ఈ నెల 20 వ తేదీ వరకు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.
18.రేపు ఎంఎంటిఎస్ రైళ్ల రద్దు

నిర్వహణ పనుల కారణంగా ఈనెల 10న కొన్ని ఎం ఎం టి ఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
19.స్కూల్ విద్యార్థులకు రవాణా భత్యం
ఊర్లలో చదువుకోవడానికి పాఠశాలలు లేక ఇతర ప్రాంతాల్లో స్కూళ్లకు వెళుతున్న విద్యార్థులకు ఇకపై 600 రవాణా భత్యం చెల్లించే విధంగా సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారు.
20.ఆర్టీసీ కారుణ్య నియామకాల్లో 1000 మందికే ఛాన్స్

ఆర్టీసీ కారుణ్య నియామకాల కోసం 1995 మంది దరఖాస్తు చేసుకోగా… వారిలో వెయ్యి మందికే ఛాన్స్ ఇవ్వనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెలిపారు.