తెల్ల జుట్టు.నేటి ఆధునిక కాలంలో యుక్త వయసులోనే చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు.
పూర్వం అరవై, డబ్బై ఏళ్లు దాటిన వారికి మాత్రం జుట్టు తెల్లగా మారేది.కానీ, ఈ రోజుల్లో కేవలం పాతిక, ముప్పై ఏళ్లకే చాలా మంది జుట్టు తెల్లబడిపోతోంది.
యంగ్ ఏజ్‌లోనే జుట్టు తెల్ల పడటం వల్ల కొందరు మానసికంగా కృంగిపోతున్నారు.ఇక చివరకు చేసేదేమి లేక.
రంగులు వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు.అయితే రంగులు వేసుకోవడం వల్ల తాత్కాలిక పరిష్కారం మాత్రమే దొరుకుంది.
పైగా జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది.
అయితే న్యాచురల్ పద్ధతిలో పలు చిట్కాలు పాటిస్తే.
తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చుకోవచ్చు.ముఖ్యంగా గుంటకలగర ఆకు తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో అద్భుతంగా సహయపడుతుంది.
పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ దర్శనమిచ్చే ఈ గుంటకలగర ఆకు.మార్కెట్లో కూడా దొరుకుతుంది.ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉంటే ఈ గుంటకలగర ఆకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా జుట్టును నల్లగా మార్చడంలో ఈ ఆకు ఉపయోగపడుతుంది.

కొన్ని గుంటకలగర ఆకులను తీసుకుని.బాగా ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.ఈ పొడిలో నువ్వులనూనె వేసి మిక్స్ చేసుకుని.తలకు, కేశాలకు బాగా పట్టించాలి.గంట పాటు ఆరనిచ్చి.ఆ తర్వాత సాధారణ ష్యాంపూతో తలస్నానం చేసేయాలి.
ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్ల జుట్టు క్రమంగా నల్లపడుతుంది.

ఇక రెండొవది.కొన్ని గుంటకలగర ఆకులను తీసుకుని మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత కొబ్బరి నూనెలో ఈ గుంటకలగర ఆకుల పేస్ట్ వేసి.
పావు గంట పాటు వేడి చేయాలి.గోరు వెచ్చగా అయిన తర్వాత ఆ నూనెను వడగట్టుకుని.
ఓ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.ఈ నూనెను రాత్రి నిద్రించే ముందు తలకు పెట్టి.
కాసేపు మసాజ్ చేసుకుని ఉదయాన్నే తలస్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.
జుట్టు నల్లగా మారుతుంది.