తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ( Akkineni Family )ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అక్కినేని నాగేశ్వరరావు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ అప్పట్లో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు.ఇక అక్కినేని నాగేశ్వరరావు మరణించినప్పటికీ ఆయన లేగసిని తన కుమారుడు నాగార్జున ( Nagarjuna )కొనసాగిస్తూ అక్కినేని కుటుంబ పేరు ప్రఖ్యాతలను నిలబెట్టారు.
నాగార్జున అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

నాగార్జున సినీ కెరియర్ లో కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి.అయితే ఇటీవల కాలంలో నాగార్జున సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి.ప్రస్తుతం ఈయన తన వ్యాపారాలను చూసుకుంటూ మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే సినిమాలను కాస్త తగ్గించడంతో అక్కినేని అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా నాగార్జునకి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మనకు ఈయన అక్కినేని నాగార్జునగా మాత్రమే తెలుసు కానీ ఆయన అసలు పేరు ఇది కాదంటూ ఇటీవల డైరెక్టర్ అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) నాగార్జున అసలు పేరు గురించి ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ నాగార్జున అసలు పేరు నాగార్జున మాత్రమే కాదని ఆయన పూర్తి పేరు నాగార్జునసాగర్( Nagarjuna Sagar ) అంటూ అసలు పేరును బయటపెట్టారు.సాగర్ కంటే నాగార్జున బాగుందని, క్యాచీగా నాగార్జున అనే ఫిక్స్ చేసుకున్నారంటూ ఈ విషయాన్ని బయట పెట్టడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.అయితే ఎన్ని రోజులు ఎక్కడ కూడా నాగార్జున తన పూర్తి పేరును బయట పెట్టకపోవడం విశేషం.