బరువు తగ్గి సన్నగా మారాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ డైట్ లో ఉండాల్సిందే!

అధిక బరువు( overweight ).ఇటీవల కాలంలో సర్వసాధారణమైన సమస్యగా మారిపోయింది.

 Follow These Simple Tips For Quick Weight Loss! Weight Loss, Weight Loss Tips, W-TeluguStop.com

అనారోగ్యకరమైన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి, పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులు తదితర కారణాల వల్ల శరీర బరువు అదుపు తప్పుతుంది.అధిక బరువుకు దారితీస్తుంది.

ఫలితంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.ఈ క్రమంలోనే ఎంతో మంది బరువు తగ్గి సన్నగా మారాలని భావిస్తుంటారు.

ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ డ్రింక్ ను తప్పకుండా డైట్ లో చేర్చుకోండి.

వెయిట్ లాస్ కు ఈ డ్రింక్ సూపర్ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.దీని తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్‌ అవ్వగానే అందులో ఏడు నుంచి ఎనిమిది ఫ్రెష్ తులసి ఆకులు( Basil leaves ) వేసుకోవాలి.అలాగే అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ) మరియు రెండు దంచిన యాలకులు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మిక్స్ చేయాలి.తద్వారా మన మిరాకిల్ డ్రింక్ సిద్దం అవుతుంది.

Telugu Belly Fat, Fat Cutter, Tips, Latest-Telugu Health

బరువు తగ్గి సన్నగా మారాలని భావిస్తున్న వారు ఈ డ్రింక్ ను ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకోవాలి.దాల్చిన చెక్క, యాలకులు, తులసి మరియు నిమ్మరసం ఇవన్నీ వెయిట్ లాస్ కి అద్భుతంగా తోడ్పడతాయి.శరీరంలో అదనపు కేలరీలను వేగంగా బర్న్ అయ్యేలా ప్రోత్సహిస్తాయి.పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును సైతం కరిగిస్తాయి.

Telugu Belly Fat, Fat Cutter, Tips, Latest-Telugu Health

అలాగే ఈ డ్రింక్ లో డైట్ లో చేర్చుకోవడం తో పాటు నిత్యం అరగంట పాటు వ్యాయామం చేయండి. వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ ఇలా మీకు నచ్చిన వ్యాయామాన్ని ఎంచుకోండి.మరియు కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.రోజుకు 8 గ్లాసుల వాటర్ తప్పనిసరిగా తీసుకోండి.మీరు ఏ ఆహారం తీసుకున్నా స‌రే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్యలో మాత్రమే తీసుకోండి.ఈ సింపుల్ చిట్కాలను కనుక పాటిస్తే చాలా సులభంగా వెయిట్ లాస్ అవ్వచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube