సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో నటి రకుల్ ప్రీతి సింగ్ ( Rakul Preet Singh ) ఒకరు.ఈమె తెలుగులోకి కెరటం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కాని వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తో అనంతరం తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరు సరసన నటించి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.

ఈ విధంగా తెలుగు తమిళ భాష చిత్రాలలో ఎంతో బిజీగా గడుపుతున్నా రకుల్ అనంతరం బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకున్నారు ఇక ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిన తర్వాత పూర్తిగా సంస్థ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.సరైన కథ దొరికితే తిరిగి సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేయటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రకుల్ వెల్లడించారు.ఇదిలా ఉండగా రకుల్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలలో ఆమె ముఖ కవళికలలో తేడా ఉన్న నేపథ్యంలో ఈమె కాస్మెటిక్ సర్జరీ( Cosmetic Surgery ) చేయించుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

రకుల్ తన పెదవులకు ఏదో కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఈమె స్పందించారు.ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ ఎవరైనా కాస్మోటిక్ సర్జరీ చేయించుకోవాలి అనుకుంటే తప్పులేదని చెప్పింది.గతంలో చాలావ్యాధులకు చికిత్స లేదని.ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది.అదేవిధంగా ఎవరైనా అందంగా కనిపించడానికి కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే అందులో తప్పు లేదని తెలిపారు.అయితే ఇప్పటివరకు నాకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకునే అవకాశం మాత్రం రాలేదని నాకు ఆ దేవుడు చాలా అందమైన మొహాన్ని ఇచ్చారు అంటూ సర్జరీ వార్తలను ఖండించారు.