దర్శకుడి వేదింపులు తట్టుకోలేక సెట్ నుంచి పారిపోయిన సూర్య

మనకు తెలిసినంతవరకు కూడా సూర్య ఒక డెడికేటెడ్ హీరో.సినిమా కోసం ఎంతైనా శ్రమిస్తాడు.

 Why Surya Escaped From Bala Shooting , Surya ,bala Shooting ,nanda ,siva Putrud-TeluguStop.com

దర్శకుడు చెప్పిన మాట విని ఆ మాటకే కట్టుబడి ఎంత కష్టానికైనా సరే ఒప్పుకుంటాడు.అలాంటి సూర్య కూడా ఒక సినిమా షూటింగ్ నుంచి పారిపోయి వచ్చాడని మీకు తెలుసా? పైగా ఇదేమి సూర్య ఇండస్ట్రీకి వచ్చినా కొత్తలో జరిగింది కాదు అప్పటికే పదుల సంఖ్యలో సినిమాలు తీసి సూపర్ స్టార్ గా సూర్య ఎదిగిన తర్వాత జరిగిన సంఘటన.సూర్యని అంతలా బాధపెట్టిన విషయం ఏంటి ? ఎందుకు పారిపోయి వచ్చాడు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

విషకుడు బాల సూర్యని హీరోగా పెట్టి నందా, శివపుత్రుడు వంటి సినిమాలు చేశాడు.ఒక గట్టి విశ్వాసం సూర్యకి.అయితే అలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి చివరికి అర్జున్ రెడ్డి రీమిక్స్ చేయడానికి ఒప్పుకోవడాన్ని బట్టి చూస్తేనే అతని కెరియర్ గ్రాఫ్ పడిపోయింది అని మనం అర్థం చేసుకోవచ్చు.

అలాంటి సమయంలో దర్శకుడు బాల కి సూర్య ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.సినిమా షూటింగ్ మొదలైంది ఒకరోజు కిలోమీటర్ దూరంలో కెమెరా ఫ్రేమ్ పెట్టి పరిగెత్తుకు రమ్మని సూర్యకి చెప్పాడట.

చెప్పింది బాలా కాబట్టి సూర్య మరో మాట చెప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడట.

అసలే వయసు 50 కి వస్తున్న సూర్యతో కిలోమీటర్ దూరంలో షార్ట్ పెట్టి పదుల సంఖ్యలో అదే షాట్ ని రీటెక్ చేస్తూ ఉన్నాడట.ఎంత అలుపొస్తున్నా సరే కిలోమీటర్ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తూనే ఉన్నాడు సూర్య.చివరగా మరోసారి పరిగెత్తమన్నాడు బాల.ఈసారి సూర్య అటు వెళ్ళాడు కానీ తిరిగి ఈ కెమెరా వైపు రాలేదు.అటు నుంచి అటే తన కారు ఎక్కి అక్కడ నుంచి పారిపోయాడు.

అంతలా సూర్యని వేధించడంతో బాలా సినిమా నుంచి సూర్య అవుట్ అయ్యాడు ఆ తర్వాత సినిమా కూడా అటకెక్కింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube