పండుగ సమయంలో కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.చల్లపల్లి సమీపంలో అదుపుతప్పిన ఓ కారు గోడను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.అదేవిధంగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.