టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) ఒకరు.ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమాతో మీనాక్షి చౌదరి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
మీనాక్షి చౌదరి రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.మీనాక్షి చౌదరి తన హైట్ గురించి మాట్లాడుతూ తాజాగా ఒక సందర్భంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సంక్రాంతి సినిమాలతో హిట్లు అందుకుంటున్న ఈ బ్యూటీ ఖాతాలో కొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి.మీనాక్షి చౌదరి మాట్లాడుతూ పెద్ద పెద్ద స్టార్లతో నేను చేసిన సినిమాలు కొంత నిరాశ పరిచిన మాట వాస్తవమే అని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు.
కొందరు వాటి ఫ్లాప్స్ కు నన్ను బాధ్యురాలిని చేస్తూ కామెంట్లు చేశారని ఆమె తెలిపారు.నేను ఫ్లాప్ లకు బాధ పడనని ఆమె అన్నారు.

ఎందుకంటే మన పని మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్తుందని మీనాక్షి చౌదరి కామెంట్లు చేశారు.తెలుగులో నా తొలి సినిమా ఇచ్చట వాహనములు నిలపరాదు వర్కౌట్ కాకపోయినా ఖిలాడీ సినిమాలో ఛాన్స్ రావడానికి అదే కారణమని ఆమె చెప్పుకొచ్చారు.నా హైట్ వల్ల అమ్మాయిలు సైతం నాతో కలవడానికి మాట్లాడటానికి ఇబ్బంది పడేవారని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు.

నేను బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ లో ఛాంపియన్ నని మీనాక్షి చౌదరి తెలిపారు.సీనియర్ హీరోలతో కలిసి నటించడానికి నాకు సమస్య లేదని ఆమె చెప్పుకొచ్చారు.చిరంజీవి గారితో విశ్వంభర( Vishwambhara ) చేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చారు.
నేను డెంటిస్ట్ నని ఆమె కామెంట్లు చేశారు.ఎవరినైనా చూస్తే మొదట పళ్లు గమనిస్తానని ఆమె అన్నారు.
నేను ప్రాక్టీస్ సైతం మొదలుపెట్టానని హీరోయిన్ గా బిజీ కావడంతో అది సాధ్యపడలేదని మీనాక్షి చౌదరి తెలిపారు.