ఇండియాలో ఎంత మంది దర్శకులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే లభిస్తుంది.యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో టాలెంటెడ్ డైరెక్టర్లుగా పేరు సంపాదించుకున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారనే చెప్పాలి.
ఇక యంగ్ డైరెక్టర్లు గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) లాంటి దర్శకుడు సైతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి తన ప్రయాణాన్ని మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోలు కొంతమంది ప్రశాంత్ వర్మ తో కలిసి సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట.కానీ ప్రస్తుతం ఆయన బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ( Mokshagna ) తో సినిమా చేస్తున్నాడు.అలాగే ‘హనుమాన్’ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ ( Jai Hanuman ) అనే సినిమాను చేస్తున్నాడు ఈ మూవీస్ పూర్తయిన తర్వాత బాలీవుడ్ కి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక బాలీవుడ్ హీరోలకి వరుసగా సక్సెస్ లు రావడం లేదు.స్టార్ హీరోల పరిస్థితి అయితే చాలా దారుణంగా తయారైంది.ఒక్క సక్సెస్ ని సాధించడానికి వాళ్ళు నాన్న తంటాలు పడుతున్నారు.

మరి ఇలాంటి సందర్భంలో మన దర్శకులు మీదనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళను అక్కడికి తీసుకెళ్లి మంచి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే భారీ విజయాలను సాధించడానికి మన దర్శకులు వాళ్లకు హెల్ప్ చేస్తారా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.తెలుగులో చాలా మంచి టాలెంట్ డైరెక్టర్లు ఉన్నప్పటికి స్టార్ హీరోలందరితో సినిమాలు చేసే అవకాశాలు వాళ్లకు రావడం లేదు.
అందువల్లే వాళ్ళు కూడా బాలీవుడ్ హీరోలను సంప్రదిస్తూ సినిమాలు చేసి భారీ విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు…
.