సాధారణంగా ఫిబ్రవరి నెల 15వ తేదీ దాటిందంటే దాదాపు ఎండల కాలం లో ఉన్నట్లే.దాదాపు ఇప్పటి నుంచే పగటి పూట ఎండలు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి.
అయితే వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి ఎండలో నుంచి వచ్చిన వారు వెంటనే ఉపశమనం కోసం చల్లటి నీటిని లేదా కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు.అయితే ఇవి తాత్కాలిక ఉపశమనమే కానీ ఆరోగ్యానికి ఈ చల్లని పదార్థాలు మంచిది కాదని ఆహార నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఇవి శరీరానికి అధిక కేలరీలను అందిస్తాయి.వాటికి బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, కూరగాయలను రోజువారి ఆహారంలో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.ఎండాకాలంలో శరీరంలోని నీరు ఎక్కువగా చెమట రూపంలో బయటకు పోతుంది.కాబట్టి నీళ్లు అధికంగా తాగుతూ ఉండడం మంచిది.
శరీరంలో నీటి శాతం తగ్గితే డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
అంతేకాకుండా ఎండాకాలంలో ప్రోటీన్స్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.పండ్ల విషయానికి వస్తే స్ట్రాబెరీ,సిట్రస్ పండ్లు తీసుకోవడం మంచిది.చర్మానికి రక్త సరఫరా చేయడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి.
అంతే కాకుండా ఇవి శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తాయి.బయట ఎండ నుంచి వచ్చినప్పుడు, ప్రయాణాలు చేసి అలసటగా అనిపించినప్పుడు కూల్ డ్రింక్స్ కి బదులుగా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, చల్లని కుండనీరు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఎండాకాలంలో అందరికీ అందుబాటులో ఉండే మామిడి పండ్లలో ఫైబర్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వివిధ పోషకాలు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి ఆరోగ్యానికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి.వేడి వాతావరణాన్ని తట్టుకునేలా నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను, కూరగాయలను తినడం మంచిది.వీటివల్ల మెదడు చురుకుగా ఉంటుంది.ఎండాకాలంలో లభించే ద్రాక్ష పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.