పెదాలు ఎంత న‌ల్ల‌గా ఉన్నా ఈ ఒక్క చిట్కాతో ఎర్ర‌గా మార్చుకోవ‌చ్చు!

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న చ‌లి కాలంలో దాదాపు అంద‌రి పెదాలు పొడి బారిపోయి న‌ల్ల‌గా త‌యారవుతుంటాయి.వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, చ‌ల్ల గాలులు, స్మోకింగ్‌, ఆహార‌పు అల‌వాట్లు ఇందుకు ప్ర‌ధాన కార‌ణాలు.

 Effective Home Remedy For Dark Lips! Home Remedy, Dark Lips, Red Lips, Lips, Lip-TeluguStop.com

అయితే ఒక్కోసారి ఎన్ని ర‌కాల లిప్ బాంబ్స్‌, స్క్ర‌బ్స్ వాడినా న‌ల్ల‌గా మారిన పెదాలు ఎర్ర‌గా మార‌వు.అలాంటి స‌మ‌యంలో ఏం చేయాలో తెలీక మ‌ద‌న ప‌డిపోతుంటారు.

ఎలా న‌ల్ల‌టి పెదాల‌ను వ‌దిలించుకోవాలో అర్థంగాక తెగ ఇబ్బంది ప‌డుతుంటారు.

అయితే పెదాలు ఎంత న‌ల్ల‌గా ఉన్నా.

ఇప్పుడు చెప్ప‌బోయే ఒక్క చిట్కాను పాటిస్తే మాత్రం ఎర్ర‌గా మార్చుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం.

ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.స్ట్రాబెరి  పండ్లు న‌ల్ల‌టి పెదాల‌ను ఎర్ర‌గా మార్చ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అందు వ‌ల్ల ముందుగా ఐదారు స్ట్రాబెరి పండ్ల‌ను తీసుకుని గింజ‌లు తొల‌గించాలి.ఇప్పుడు గింజ తీసిన స్ట్రాబెరి పండ్ల‌ను మెత్త‌టి పేస్ట్‌లా చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్‌, ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌కు పూత‌లా వేసుకుని.ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.ఆపై వేళ్ల‌తో స్మూత్‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ పెదాల‌ను కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే గ‌నుక న‌ల్ల‌టి పెదాలు క్ర‌మంగా ఎర్ర‌గా మార‌తాయి.మ‌రియు ఈ చిట్కాను ప్ర‌య‌త్నించ‌డం వ‌ల్ల పెదాల‌పై డెడ్ స్కిన్ సెల్స్ తొల‌గిపోయి తేమ‌గా, మృదువుగా త‌యార‌వుతాయి.

ఇక ఈ చిట్కాతో పాటు వాట‌ర్ ఎక్కువ‌గా సేవించాలి.తాజా పండ్లు, కూర‌గాలు డైట్‌లో చేర్చుకోవాలి.

నైట్ నిద్రించే ముందు పెదాల‌కు ఉన్న లిప్‌స్టిక్‌ను పూర్తిగా తొల‌గించి మాయిశ్చ‌రైజ‌ర్‌ను అప్లై చేసుకుని నిద్రించాలి.త‌ద్వారా పెదాల ఆరోగ్యం దెబ్బ తిన‌కుండా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube