కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రెట్రో.( Retro ) ఈ సినిమాలో సూర్య( Suriya ) హీరోగా నటించగా పూజా హెగ్డే( Pooja Hegde ) హీరోయిన్ గా నటించింది.
కాగా ఈ మూవీ మే 1న, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.
ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ,( Vijay Devarakonda ) దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.పహల్గాంలో( Pahalgam ) జరిగిన ఘటన ఎంతో బాధాకరం.

మీ బాధను దగ్గరుండి పంచుకోలేకపోయినా, మేమూ దాన్ని అనుభవిస్తున్నాము.బాధితులకు అండగా నిలబడతాము.కశ్మీర్‌లో( Kashmir ) జరుగుతున్న దురాగతాలకు కారణం చదువు లేకపోవడమే.వాళ్లందరికీ చదువు చెప్పించి, బ్రెయిన్ వాష్ కాకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలి.ఇలాంటి చర్యల వల్ల ఏం సాధిస్తారో తెలియదు.కశ్మీర్ ఇండియాదే.
కశ్మీరీలు మనవాళ్లే.నేను రెండేళ్ల కిందట అక్కడ షూటింగ్ కు వెళ్లాను.
చాలా బాగా చూసుకున్నారు.పాకిస్థాన్ లో నీళ్లు, కరెంట్ లేక ఇబ్బంది పడుతుంటే, వాటి సంగతి చూసుకోకుండా ఇక్కడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు.
పాకిస్థాన్ పై ఇండియా దాడి చేయాల్సిన అవసరం లేదు.

కొన్ని రోజులు పోతే, ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై దాడి చేస్తారు.మనమంతా ఒక్కటిగా కలిసి ఉండాలి.ఎదుటి వ్యక్తిని ప్రేమించటం నేర్చుకోవాలి.
మనం జీవితంలో ముందుకు వెళ్లాంటే అందుకు తాళం చెవి చదువు ఒక్కటే.మనం మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా ముందుకు వెళ్తుంది అని తెలిపారు విజయ్ దేవరకొండ.
అనంతరం హీరో సూర్య గురించి మాట్లాడుతూ.నేను ఇంటర్ లో ఉన్నప్పుడు సూర్య అన్న గజినీ సినిమా చూశాను.
నేను నటుడిని అవుదామనుకున్నప్పుడు ఎలాగైనా ఆయన్ను కలవాలని బలంగా ఉండేది.జీవితంలో మా దారులు కలుస్తాయని అనుకోలేదు.15 ఏళ్ల తర్వాత మేము కలిశాము.సినిమాలు హిట్ లు ప్లాఫ్ లు అవుతుంటాయి.
కానీ, తెరపై సూర్య నటన చూసినప్పుడు ఎంతో స్ఫూర్తినిస్తాయి.పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చేసిన తర్వాత కాస్త డబ్బులు రావడంతో చదువు విషయంలో ఏదైనా సాయం చేయాలని ఉండేది.
కొంతమందికి చేశాం.కానీ, 15 ఏళ్లుగా సూర్య అన్న అగరం ఫౌండేషషన్ ద్వారా సాయం చేస్తూ ఉన్నారు.
నాకు అది బాగా నచ్చింది.ఈ ఏడాది విద్యార్థులతో కలిసి అలాంటి వేదికను ఏర్పాటు చేస్తాను అని అన్నారు విజయ్ దేవరకొండ.