ప్రస్తుతం కంటికి కనిపించని ప్రాణాంతక వైరస్ కరోనా ప్రపంచదేశాలను కమ్మేసింది.ఈ మహమ్మారి మొదలై ఆరేడు నెలలు గడుస్తున్నా.
వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంలేదు, కరోనా జోరు తగ్గడం లేదు.దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీ స్థాయిలో పెరిగిపోతోంది.
మరోవైపు ఈ కరోనాను గెలవాలంటే.శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంలో బీరకాయ కూడా ఒకటి.అవును! బీరకాయను జ్యూస్ రూపంలో తీసుకవడం వల్ల రోగాలతో పోరాడే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అలాగే ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు శరీరానికి సోకుండా సహాయపడుతుంది.బీరకాయ కేవలం రోగనిరోధక శక్తి పెంచడం మాత్రమే కాదు.
శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చుతుంది.

మధుమేహంతో బాధపడేవారు ఖచ్చితంగా తమ డైట్‌లో బీరను చేర్చుకోవాలి.ఎందుకంటే.ఇన్సులిన్ లెవల్స్ కంట్రోల్ చేసే శక్తి బీరకు పుష్కలంగా ఉంటుంది.
అలాగే బీరకాయల్లో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది.ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది.
బీరకాయల్లో కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు చాలా తక్కువగా.పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
అందుకే.బరువు తగ్గాలనుకునే వారు బీరకాయలను ఏదో ఒక రూపంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.అదేవిధంగా, బీరలో ఉండే విటమిన్- సి జలబ్బు, దగ్గు వంటి సమస్య నుంచి రక్షిస్తుంది.ఇక చర్మానికి కూడా బీరకాయ ఎంతో మేలు చేస్తుంది.
ప్రతిరోజు ఒక గ్లాస్ బీరకాయ జ్యూస్ తాగితే.చర్మంపై ఉన్న ముడతలు తగ్గి, యవ్వనంగా మారుతుంది.