భార్య భర్తల మద్య గొడవలు అనేవి చాలా కామన్‌గా వస్తూనే ఉంటాయి.అయితే కొన్ని ఫ్యామిలీల్లో తరచు గొడవలు వస్తూ ఉంటాయి.
ఈమద్య కాలంలో ఒక సర్వేలో వెళ్లడయిన విషయం ప్రకారం పెళ్లయిన తర్వాత మూడు నుండి పది సంవత్సరాల మద్య వారు ఎక్కువగా, తరచుగా గొడవ పడుతూ ఉంటారట.పెళ్లి అయిన మూడు సంవత్సరాల వరకు గొడవలు చాలా తక్కువగా ఉంటాయి.
వచ్చినా కూడా ఆ గొడవలకు ఎవరో ఒకరు తగ్గడం వల్ల ఆ గొడవ సర్దుమనుగుతుంది.ఆ తర్వాత నుండి నువ్వా నేనా అన్నట్లుగా గొడవలు సాగుతాయట.ఇక పెళ్లయిన పదేళ్ల తర్వాత ఇద్దరిలో కూడా ఒకరి గురించి ఒకరికి లోటు పాటు తెలియడం వల్ల దానికి అనుగుణంగా నడుచుకుంటూ గొడవలకు దూరంగా ఉంటున్నారట.
ఇక ఆ సర్వేలోనే మరో ఆసక్తికర విషయం కూడా వెళ్లడయ్యింది.భార్య భర్తల మద్య గొడవలకు కారణం ఎక్కువ భార్యలే కారణమట.సహజంగా ఆడవారిలో అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది.
అంటే తమను ఎవరైనా మోసం చేస్తున్నారేమో, మోసం చేయబడతామేమో, ఎవరైనా ఏమైనా అంటారేమో అనే భావన ఎక్కువగా ఉంటుంది.దాని వల్ల సహజంగానే భర్తలతో భార్యలు ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు.
అందుకే భార్యలతో సఖ్యతను పాటించేందుకు నిపుణులు అయిదు విషయాలను సూచించారు.అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.
1.భార్య అభిరుచులకు తగ్గట్లుగా నడుచుకోవడం.2.ఆమెతో ఏ విషయాన్ని నేరుగా నో చెప్పకుండా, ఆమెకు మెల్ల మెల్లగా అర్థం అయ్యేలా చెప్పుకోవాలి.
3.పిల్లల విషయంలో శ్రద్ద చూపడం వల్ల ఆడవారు చాలా రిలాక్స్ ఫీల్ అయినట్లుగా భావిస్తారు.దాని వల్ల గొడవలు తగ్గుతాయి.4.ఇతరుల గురించి భార్య ముందు అధికంగా మాట్లాడకుండా ఉండటం చాలా మంచిది.5.చివరగా ఆమెను ఎప్పుడు కూడా పొగుడ్తూనే ఉండాలి.
ఇంత జాగ్రత్తగా ఉంటూ ఉన్నా కూడా గొడవలు అనేవి సహజంగా ఉంటాయి.
అయితే ఇవి పాటించకుంటే మాత్రం రోజు రణరంగమే.