ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఎన్నికల ముందు చక్రం తిప్పిన నాయకులంతా తమ పార్టీ లు ఓటమి పాలవడంతో ఇప్పుడు సరైన దారిలో వెళ్లే తమ రాజకీయ భవిష్యత్తు ఎటువంటి డోకా లేకుండా చూసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఎన్నికల ముందు ఉన్న తమ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మళ్లీ తమ గ్రాఫ్ పెంచుకుని వచ్చే ఎన్నికల నాటి కైనా బలమైన పునాదులు వేసుకోవాలని చూస్తున్నారు.ఈ క్రమంలోనే సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ తన రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.సిబిఐ అధికారిగా, డైనమిక్ ఆఫీసర్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిపోయారు విశాఖ ఎంపీగా పోటీ చేసి ఇ ఓటమి చెందడంతో పాటు తన రాజకీయ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేసుకున్నారు.

ఆ బాధతోనో లేక మరేదైనా కారణంతోనో ఆయన జనసేన పార్టీలో ఉన్నాలేనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.ఇదే సమయంలో ఆయన బిజెపి లో చేరబోతున్నారని, ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది.సరిగ్గా ఇదే సమయంలో ఆయన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తో భేటీ అవ్వడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.గోదావరి జిల్లా కిర్లంపూడి లో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇంటికి జె డి లక్ష్మీనారాయణ రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దీనిపై బీజేపీ వ్యూహం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక ముద్రగడ ఇంటి వద్ద జేడీకి ఘన స్వాగతం లభించింది.తన ఇంటికి వచ్చిన ఆయన్ను చూసి ముద్రగడ ఆనందంతో పరవశించి పోయారట.తన ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించిన ఆయన అక్కడ ఆయనకు స్వయంగా అల్పాహారం కూడా వడ్డించారట.

ఆ తరువాత ఓ గంట పాటు వారు ఏకాంతంగా తాజా రాజకీయాల గురించి చర్చించుకున్నట్టు సమాచారం.అయితే ఆ సందర్భంగా వారి మధ్య ఏ విషయాలు చర్చకు వచ్చాయి అనే విషయం మాత్రం బయటకి రాలేదు.ముద్రగడ వ్యవహారానికి వస్తే ఆయన ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు.ఎన్నికల ముందు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల్లో చేరబోతున్నారంటూ రకరకాల పుకార్లు వచ్చాయి.కానీ ఆయన మాత్రం ఏ పార్టీలోనూ చేరకుండా సైలెంట్ గానే ఉండిపోయారు.కానీ ఎన్నికల అనంతరం మళ్ళీ ఆయన రాజకీయ ప్రస్థానంపై వార్తలు వస్తున్నాయి.
కొంత కాలం గా ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.ముద్రగడ కోసం బీజేపీ కూడా ఎదురుచూస్తోంది.
ఆయన కనుక బీజేపీ లో చేరితే కోస్తాలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులు బిజెపికి అండగా నిలుస్తారని ఆ పార్టీ భావిస్తోంది.ఇటువంటి సమయంలో జె.డి ముద్రగడ భేటీ అవ్వడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.







