మధుమేహం లేదా డయాబెటిస్ లేదా చక్కెర వ్యాధి.పేరు ఏదైనా జబ్బు ఒకటే.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి మధుమేహం అనేది పెద్ద శత్రువు గా మారింది.ఒక్కసారి మధుమేహం బారిన పడ్డామంటే జీవితకాలం దానితో సావాసం చేయాల్సిందే.
అయితే మధుమేహం ఉన్నవారు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవడం ఎంత అవసరమో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.ఈ నేపథ్యంలోనే చాలా మంది మందులు వాడుతుంటారు.
అయితే కొన్ని కొన్ని ఆహారాల ద్వారా కూడా బ్లడ్ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే మూడు ఆహారాలను డైట్లో చేర్చుకుంటే సహజంగానే మీ బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.
మరి ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి.? అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

బెండకాయ. ఏడాది పొడవునా దొరికే కూరగాయల్లో ఇది ఒకటి.అయితే బెండకాయ మధుమేహం వ్యాధి గ్రస్తులకు ఒక వరం అని చెప్పవచ్చు.అవును, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో బెండకాయ అద్భుతంగా సహాయపడుతుంది.అందుకే మధుమేహం ఉన్న వారు బెండకాయతో తయారు చేసే వంటలను తరచూ తీసుకుంటూ ఉంటే చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.

దాల్చిన చెక్క. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించగల సామర్థ్యం దీనికి పుష్కలంగా ఉంది.రోజుకు ఒక కప్పు దాల్చిన చెక్క టీ ని గనుక తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
పైగా దాల్చిన చెక్క టీను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు సైతం లభిస్తాయి.
అలాగే విత్తనాలు కూడా చక్కెర స్థాయిలను అదుపులో ఉంచగలవు.
ముఖ్యంగా అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, చియా గింజలు, పుచ్చ గింజలు తదితర వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.







