ఆర్ నారాయణ మూర్తి( R Narayana Murthy ) పేరు చెబితే ఎవరికైనా విప్లవ భావాలతో ఆయన తీసిన సినిమాలు, సామాజిక ఉద్యమాల వల్ల జరిగిన నిజ జీవిత సంఘటనలు చేసుకుని తీసిన సినిమాలు గుర్తుకు వస్తాయి.కానీ ఆయనపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఒప్పుకోరు.
డబ్బులు దాచుకోవాలని లేదా నిర్మాతల నుంచి దోచుకోవాలని ఏ రోజు ప్రయత్నించడు.అందుకే నారాయణమూర్తి అంటే నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరుగా భావిస్తూ ఉంటారు.
కానీ వీటన్నిటికీ విరుద్ధంగా యాంకర్ ఝాన్సీ( Anchor Jhansi ) మాత్రం నారాయణమూర్తి పై కొన్ని సంచలనం వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఆయన చేసిన పని వల్ల తాను ఒక సినిమాలో నటించకుండా బయటకు వచ్చేసానంటూ చెబుతుంది ఝాన్సీ.

విషయంలోకి వెళితే అడవుల నేపథ్యంలో( Forest Backdrop Movie ) ఆర్ నారాయణ మూర్తి నిర్మాతగా దర్శకుడుగా హీరోగా చేసిన ఒక సినిమాలో ఝాన్సీకి మంచి పాత్ర ఇచ్చారట ఆయన.కానీ ఝాన్సీ షూటింగ్ సెట్ లో ఉండే విధానం నారాయణ మూర్తికి నచ్చలేదట.దాంతో కొన్ని రోజులు షూటింగ్( Movie Shooting ) చేసిన తర్వాత చివరికి క్లైమాక్స్ సమయంలో ఆవిడ స్థానంలో మరొక నటిని పెట్టి షూటింగ్ చేశారట ఈ విషయం ఎవరో చెబితే ఆమెకు తెలిసిందట.దాంతో ఆమె నాకు స్థానం లేని చోట నేను నటించాల్సిన అవసరం లేదని, ఆయనకు నచ్చనంత మాత్రాన తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అంటూ తెల్చి చెప్పారు అట.ఆయన తీసేయడం కాదు నేనే ఆ సినిమాలో నటించిను అంటూ వాక్ ఔట్ చేసినట్టు ఝాన్సీ తెలిపారు.

ఆ సినిమాకు సంబంధించి డబ్బులు కూడా తీసుకోలేదని చెట్లల్లో, అడవుల్లో, గుట్టల్లో చాలా కష్టపడ్డాను అని, ఒక సన్నివేశంలో జీపు వెనకాలే పరిగెత్తాల్సి ఉండగా ఒళ్ళు హూనమయ్యే విధంగా కష్టపడ్డాను అంటూ ఝాన్సీ చెప్పటం విశేషం.ఏదేమైనా ఇండస్ట్రీలో ఝాన్సీ మరియు ఆర్ నారాయణ మూర్తి ఇద్దరు కూడా భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వారే.కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఇలా ఝాన్సీ విధానం ఆర్ నారాయణమూర్తికి నచ్చకపోవడం, అలాగే చెప్పకుండా సినిమాలో నుంచి ఝాన్సీ ని తీసేయడం వంటివి ఆర్ నారాయణమూర్తి పై ఆమెకు కోపాన్ని కలిగించేలా చేశాయి.