ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, కాలుష్యం, రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను వాడటం, జుట్టు సంరక్షణ లేకపోవడం తదితర కారణాల వల్ల కొందరిలో హెయిర్ ఫాల్ సమస్య చాలా అంటే చాలా అధికంగా ఉంటుంది.ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేయడం కోసం తోచిన ప్రయత్నాలు అన్ని చేస్తుంటారు.
ఖరీదైన నూనె, షాంపూలను వాడుతుంటారు.
అయితే ఒక్కోసారి ఎన్ని చేసినా సరే హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేయలేకపోతుంటారు.
అయితే అలాంటప్పుడు క్యారెట్ తో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే చాలా సులభంగా మరియు వేగంగా జుట్టు రాలడాన్ని ఆపవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం క్యారెట్ తో హెయిర్ ఫాల్ ను ఎలా అడ్డుకోవచ్చో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి.
ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కను కూడా తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.ఈ తురుము నుంచి స్ట్రైనర్ సహాయంతో అల్లం జ్యూస్‌ను వేరు చేయాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో దాదాపు పది టేబుల్ స్పూన్లు క్యారెట్ జ్యూస్, ఐదు టేబుల్ స్పూన్లు అల్లం జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరిగా రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసి అన్నీ కలిసేలా స్పూన్ తో కలపాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.
గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెడ్ బాత్ చేయాలి.వారంలో రెండు సార్లు కనుక ఈ విధంగా చేస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
అదే సమయంలో కురులు ఒత్తుగా మరియు పొడుగ్గా పెరగడం ప్రారంభం అవుతుంది.