ప్రేమకు జాతి, కులం, మతం, వయసు అనే భేదాలు లేవని.అదే విధంగా ప్రేమకు సమయం, సందర్భం కూడా అడ్డుకాదని మరోసారి నిరూపించారు తమిళ యువ దర్శకుడు అభిషన్ జీవంత్.
తన జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని చేరుకున్న తర్వాత తన ప్రేమను అధికారికంగా ప్రకటించి అందరినీ ఆకట్టుకున్నాడు.తాజాగా జరిగిన “టూరిస్ట్ ఫ్యామిలీ”( Tourist Family ) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిషన్ జీవంత్ ( Abhishan Jeevanth )తన చిన్ననాటి స్నేహితురాలు అఖిలకు (Akhila )స్టేజ్ పైనే ప్రపోజ్ చేశాడు.
ఎంతో భావోద్వేగంతో, తన ప్రేమను అందరిముందు వ్యక్తపరచడంతో ఆ క్షణం మైమరిపించింది.అతడు తన ప్రియురాలికి ఈ ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకుంటానని ప్రకటించగా, ఆమె ఆనందభాష్పాలతో స్పందించడం అక్కడున్నవారందరినీ హర్షాతిరేకానికి గురి చేసింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అభిషన్ జీవంత్ చూపిన పద్ధతి ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.జీవితంలో ముందుగా ఒక లక్ష్యాన్ని చేరుకొని, ఆ తర్వాతే ప్రేమను సాకారం చేసుకోవాలని చూపించిన ఆయన తీరు నెట్టింట్లో ప్రశంసల జల్లు కురిపిస్తోంది.ఈ తరం యువత చాలామంది ఎలాంటి లక్ష్యం లేకుండా ప్రేమ పేరుతో తొందరపడుతూ, చివరికి సంబంధాలను కోల్పోయే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి సమయంలో అభిషన్ జీవంత్ చూపించిన మార్గం యువతకి మంచి మార్గదర్శకం అవుతోంది.“ముందు లక్ష్యాన్ని చేరుకోండి, తర్వాత జీవితాన్ని తీర్చిదిద్దుకోండి” అనే సందేశాన్ని ఈ సంఘటన అందరికి చక్కగా తెలిపింది.మొత్తానికి, అభిషన్ జీవంత్ ప్రేమ కథ ఇప్పుడు తమిళనాడులోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ ప్రేమికులకు ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తోంది.ప్రస్తుతం ఈ క్యూట్ ప్రపోజల్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.