Soundarya Abbas: సౌందర్య తో నటించే అవకాశం అబ్బాస్ ఎలా మిస్ చేసుకున్నాడో తెలుసా ?

సౌందర్య.( Soundarya ) కర్ణాటక లో పుట్టి తెలుగు వారికి ఆరాధ్య దేవతగా, మహానటిగా ఎదిగిన హీరోయిన్.ఆమె అభినయంతో, అందం తో ఎందరో హృదయాలను కొల్లగొట్టింది.సౌందర్య తో ఒక్క సినిమా నటిస్తే చాలు ఇక జీవితంలో ఏమి సాధించాల్సిన పని లేదు అని అప్పట్లో చాల మంది కుర్ర హీరోలు కలు కనేవారు.

 Abbas Missed A Chance To Work With Soundarya-TeluguStop.com

సౌందర్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒక ఊపు ఊపుతున్న సమయంలో ఆమె కన్నా వయసులో మూడేళ్లు చిన్నవాడైన అబ్బాస్ కి( Abbas ) ప్రేమదేశం సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది.అప్పట్లో అబ్బాస్ కి ఉండే క్రేజ్ ఎలా అంటే అతడు హెయిర్ స్టైల్ కి, డ్రెస్ స్టయిల్ కి ఫుల్ ఫ్యాన్ బేస్ ఉండేది.

అబ్బాస్ హెయిర్ కట్ అని అప్పట్లో కుర్రాళ్లంతా కూడా అదే ఫాలో అయ్యేవారు.అంత క్రేజ్ ఉన్నా అబ్బాస్ ని చూస్తే అమ్మాయిలకు డ్రీం బాయ్ లా కనిపించేవాడు.

అయితే సరిగ్గా ప్రేమదేశం సినిమా( Premadesam Movie ) విడుదల అయినా సమయంలో వినీత్( Vineeth ) కన్నా కూడా అబ్బాస్ కే ఫ్యాన్ బేస్ ఏర్పడింది.చూడటానికి స్మూత్ గా, డీసెంట్ గా ఉండే వినీత్ కన్నా స్టయిల్ గా ఉండే అబ్బాస్ ని అందరు ఇష్టపడేవారు.

అయితే సౌందర్య అప్పటికే స్టార్ హీరోయిన్ అయినా కూడా స్టోరీ డిమాండ్ చేయడం తో తన కన్నా చిన్న హీరోతో చేయడానికి అంగీకరించింది.వయసులో ఏడాది పెద్ద అయినా అమ్మాయికి, చిన్నవాడైన హీరో కి మధ్యలో ప్రేమ పుడితే ఎలా పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు అనే చెప్పే సినిమా ఆరోప్రాణం.

Telugu Abbas, Abbas Soundarya, Aropranam, Vineeth, Soundarya, Prema Desam, Sweth

ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది.ఇందులో సౌందర్య హీరో కన్నా పెద్ద అయినా పాత్రలో నటిస్తే హీరో పాత్రలో వినీత్ నటించాడు.అయితే మొదట ఈ చిత్ర దర్శకుడు హీరో గా అబ్బాస్ ని అనుకోని ఆయన్ను కలవడానికి చెన్నై వెళ్ళాడట.ఆ టైం కి అబ్బాస్ ని కలవడానికి సెట్ కి వెళ్తే అయన చుట్టూ చాల మంది అమ్మాయిలు గుంపులు గుంపులుగా ఉన్నారట.

దాంతో వారికి ఆటోగ్రాఫ్స్ ఇవ్వడానికి అబ్బాస్ కి చాల టైం పట్టిందట.

Telugu Abbas, Abbas Soundarya, Aropranam, Vineeth, Soundarya, Prema Desam, Sweth

వారిని తప్పించుకొని అబ్బాస్ ని కలిసి కథ చెప్పడం దాదాపు అసాధ్యం అని అక్కడ నుంచి దర్శకుడు వెనక్కి వచ్చేశారట.కానీ ఆరోప్రాణం సినిమా( Aaropranam Movie ) విజయం సాధించడం తో అబ్బాస్ కొంచం ఫీల్ అయ్యారట.అందుకని సౌందర్య తో ఎలాగైనా నటించాలని అయన ప్రయత్నం చేసిన ఇద్దరు హీరో హీరోయిన్స్ గా కలిసి నటించడం అప్పుడు సాధ్యం కాలేదు.

కానీ 2004 సౌందర్య చనిపోవడానికి కొన్ని రోజుల ముందు శ్వేతా నాగు( Swetha Nagu Movie ) అనే సినిమాలో కలిసి నటించారు.అంతకు ముందు నరసింహ లో సౌదర్యం కుమార్తెను పెళ్లి చేసుకునే పాత్రలో అబ్బాస్ నటించగా, రాజా, అనగనగా ఒక అమ్మాయి వంటి సినిమాలో కాంబినేషన్ లేకపోయినా నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube