ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.వైసీపీ దారుణంగా ఓడిపోగా కూటమి భారీ విజయం సాధించింది.
ఇకపోతే గత వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) సినీ పరిశ్రమని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే.ముఖ్యంగా కొత్త సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడంలో ,అదనపు షోలు విషయంలో అనుమతులు ఇవ్వకపోవడం ఇలా చాలా విషయాలలో సినిమా ఇండస్ట్రీ వారిని ఇబ్బంది పెట్టే విధంగానే ప్రవర్తించింది వైసీపీ ప్రభుత్వం.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాలు వస్తే చాలు దారుణంగా టికెట్ రేట్లు తగ్గించేయడం వంటివి మనం చూస్తూనే వచ్చాము.
అంతేకాదు వైసీపీ హయాంలో సినిమా స్టార్స్ ని బలవంతంగా వైజాగ్ కి షిఫ్ట్ అయిపోవాలని ఆదేశించడం కూడా జరిగింది.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా కల్కి సినిమా విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయి మంచి సక్సెస్ అయిన సందర్భంగా ఈ సినిమా నిర్మాత అశ్వినీ దత్ మాట్లాడుతూ జగన్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.
ఈ సందర్భంగా అశ్విని దత్ మాట్లాడుతూ.జగన్ పతనాన్ని నేను ముందుగానే ఊహించడం జరిగింది.
ఆంధ్రాలో ఎక్కడికి వెళ్లినా ఆయనకు వ్యతిరేకంగా జనాలు మాట్లాడటం, సాధ్యమైనంత త్వరగా జగన్ దిగిపోవాలని,వాళ్ళు కోరుకోవడాన్ని నేను కళ్లారా చూశాను.మొత్తానికి అనుకున్నదే జరిగింది.నిశ్శబ్దం ఎప్పుడూ ప్రమాదకరం.ఆంధ్రప్రదేశ్ ప్రజల సైలెన్స్ ని అప్పటి అధికార ప్రభుత్వం తక్కువ అంచనా వేసింది అంటూ అశ్వినీదత్ కామెంట్స్ చేశారు.ఎన్నికల సమయంలో కచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది అని అశ్వినీదత్ ఎంతో ధీమాగా చెప్పారు.అప్పటివరకు టాలీవుడ్ ప్రముఖులు కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు.
అశ్వినీదత్( ashwini dutt ) వల్లే అంతా బయటపడ్డారు అనుకోవచ్చు.మొత్తానికి అశ్వినీ దత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.