ఓడపై 100 మందిని మట్టి కరిపించే ఫైట్.. వార్2 సినిమాకు ఈ ఫైట్ హైలెట్ కానుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ప్రస్తుతం వార్2 సినిమాతో( War 2 ) బిజీగా ఉండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.వార్2 సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా ఈ ఏడాది ఆగష్టు నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా హిట్ గా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

 Young Tiger Junior Ntr War2 Movie Fight Scene Details Inside Goes Viral In Soci-TeluguStop.com

వార్2 సినిమాలో ఓడపై 100 మందిని మట్టి కరిపించే ఫైట్ సీన్ ఉంటుందని ఈ సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచే విధంగా ఉంటుందని తెలుస్తోంది.వార్2 సినిమాలో తారక్ యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.వార్2 సినిమా భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.వార్2 సినిమా నుంచి త్వరలో వరుస అప్ డేట్స్ రానున్నాయి.

Telugu Hrithik Roshan, Ntr, Ntrhrithik, Ntr War, Pan India, War, War Scene-Movie

యశ్ రాజ్ ఫిల్మ్స్( Yashraj Films ) బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.తారక్ వరుసగా మల్టీస్టారర్ సినిమాలలో నటించడంపై కొంతమేర విమర్శలు వ్యక్తమవుతున్నా తారక్ పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటే మాత్రమే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Hrithik Roshan, Ntr, Ntrhrithik, Ntr War, Pan India, War, War Scene-Movie

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు.వార్2 సినిమా బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేసే సినిమా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందేమో చూడాలి.

ఎన్టీఆర్ ఈ సినిమాకు 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube