టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో తిరువీర్( Hero Thiruveer ) ఒకరు.మసూద సినిమాతో( Masooda Movie ) పాటు మరికొన్ని సినిమాలలో నటించిన తిరువీర్ అమ్మ చివరి కోరిక తీర్చి వార్తల్లో నిలిచారు.
తెలంగాణకు చెందిన తిరువీర్ ప్రస్తుతం పలు సినిమాలలో హీరోగా నటిస్తూ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.తిరువీర్ తాజాగా తల్లి చివరి కోరికను తీర్చానని పోస్ట్ పెట్టారు.
2016 సంవత్సరం నుంచి తిరువీర్ కెరీర్ పరంగా సినిమాలతో బిజీగా ఉన్నారు.సొంతూరిలో తాజాగా ఇల్లు కట్టుకున్న తిరువీర్ ఈ కోరిక తన తల్లి చివరి కోరిక అని ఎట్టకేలకు ఈ కోరిక తీరడం సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.
తన భార్యతో కలిసి తిరువీర్ గృహ ప్రవేశం( Thiruveer House Warming ) చేయడం గమనార్హం.రెండు దశాబ్దాల కల అమ్మ చివరి కోరిక అంటూ సొంతింటి కలను నెరవేర్చుకోవడం గురించి చెప్పుకొచ్చారు.

పరేషాన్, టక్ జగదీష్, పలాస 1978, జార్జ్ రెడ్డి మరికొన్ని సినిమాలలో తిరువీర్ నటించి తన నటనతో మెప్పించారు.తిరువీర్ సొంతింటి కలను నెరవేర్చుకోవడాన్ని నెటిజన్లు సైతం మెచ్చుకుంటున్నారు.తిరువీర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.స్టార్స్ సినిమాల్లో ఛాన్స్ వస్తే తిరువీర్ కు ఎంతో ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

తిరువీర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.గతేడాది తిరువీర్ కల్పన అనే యువతిని పెళ్లి చేసుకున్నారు.తిరువీర్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సోషల్ మీడియాలో సైతం తిరువీర్ కు బాగానే క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.
ఒకటి రెండు బోల్డ్ సినిమాల్లో సైతం తిరువీర్ నటించి తన నటనతో మెప్పించడం జరిగింది.హీరో తిరువీర్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.