అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో( Donald Trump ) కలిసి ఎలాన్ మస్క్( Elon Musk ) విందులో పాల్గొన్నారు.అంతేకాదు, ఆ విందులో మస్క్ చేసిన పని చూసి అందరూ షాక్ అయ్యారు.
అసలు ఏం జరిగిందంటే, మార్చి 15న ఫ్లోరిడాలోని ట్రంప్ మార్-ఎ-లాగో( Trump Mar-a-Lago ) ఎస్టేట్‌లో విందు జరిగింది.ఈ విందుకు మస్క్, ట్రంప్, ఇంకా మస్క్ భాగస్వామి శివోన్ జిలిస్ కూడా హాజరయ్యారు.
అక్కడ మస్క్ తన చిటికెన వేలిపై ఒక ఫోర్క్, రెండు స్పూన్లు బ్యాలెన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియో వైరల్( Viral Video ) అవ్వడంతో మస్క్ స్వయంగా స్పందించారు.“ఒక ఫోర్క్, రెండు స్పూన్లు నా వేలి కొనపై బ్యాలెన్స్ చేశాను” అని ట్వీట్ చేశారు.దీంతో ఆ వీడియోలో ఉన్నది మస్క్ అని కన్ఫర్మ్ అయిపోయింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.కొందరు మస్క్ ఫిజిక్స్, బ్యాలెన్స్ ట్రిక్ చూసి ఆశ్చర్యపోతున్నారు.“కచ్చితంగా దీనికి మార్స్ కనెక్షన్ ఉండి ఉంటుంది.ఏం ఆలోచిస్తున్నారో?” అని ఒక యూజర్ ఫన్నీగా కామెంట్ చేశారు.ఇంకొకరేమో “ఎలాన్ ఏలియన్ అని ప్రూవ్ అయిపోయింది” అని నవ్వేశారు.
మరికొందరు మాత్రం “మరీ బోర్ కొడితే ఇలాగే చేస్తారు” అంటూ కామెంట్స్ పెట్టారు.
ఈ విందుకు ఒక్కొక్క సీటుకి అక్షరాలా ఒక మిలియన్ డాలర్లు అంటే దాదాపు 8 కోట్ల రూపాయలు అని తెలిసింది.“మాగా ఇంక్” పేరుతో ట్రంప్ “మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్” ప్రచారం కోసం ఈ విందు ఏర్పాటు చేశారు.ట్రంప్ “స్పెషల్ గెస్ట్” మాత్రమే అయినా, డొనేషన్లు మాత్రం ట్రంప్ 2024 ఎన్నికల ప్రచారం కోసం “మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ PAC”కి వెళ్తాయి.
ఇన్విటేషన్‌లో”ప్రత్యేక అతిథిగా ప్రెసిడెంట్ డొనాల్డ్ జె.ట్రంప్ తో క్యాండిల్ లైట్ డిన్నర్ కి మీకు ఆహ్వానం పలుకుతున్నాము.” అని రాశారు.సీట్లు తక్కువగా ఉండటం వల్ల, ఫస్ట్ వచ్చిన వాళ్లకే ఫస్ట్ ఛాన్స్ అని కూడా అందులో మెన్షన్ చేశారు.
మొత్తానికి మస్క్ టేబుల్ ట్రిక్, హై-ప్రొఫైల్ డిన్నర్ కలగలిపి సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి.జనాలు మాత్రం ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తున్నారు, అసలు మ్యాటర్ ఏంటా అని ఆలోచిస్తున్నారు.