హైదరాబాద్ లో ల్యాండ్ అయినా డేవిడ్ భాయ్.. ఈసారి మ్యాచ్ కోసం కాదండోయ్!

క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరైన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ (David Warner) పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బ్యాటింగ్‌లో తన దూకుడు, అద్భుతమైన షాట్లతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వార్నర్, కేవలం క్రికెట్‌లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయ్యాడు.

 Even Though He Landed In Hyderabad, David Bhai Wasn't There For The Match This T-TeluguStop.com

ప్రత్యేకంగా, తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన క్రికెటర్ అని చెప్పాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన అతను, హైదరాబాద్ అభిమానులకు ప్రత్యేకమైన అనుబంధంగా మారిపోయాడు.

అంతేకాక, తెలుగులో పలు ఫిల్మీ రీల్స్ చేస్తూ తెలుగు సినిమాలకు, హీరోల మేనరిజానికి మరింత దగ్గరయ్యాడు.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టైల్‌ను అనుకరించి తన వీడియోలతో అభిమానులను ఎంతగానో అలరించాడు.

Telugu Cricket, Davidbhai, David, Hyderabad, Ipl, Mythri Makers, Nithiin, Robin

అత్యధికంగా క్రికెట్ అభిమానులను కలిగి ఉన్న వార్నర్ ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ అడుగు పెట్టాడు.టాలీవుడ్ యంగ్ హీరో నితిన్( Nitin ) హీరోగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ సినిమాలో డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.టాలీవుడ్ ప్రేక్షకులకు ఇది ఎంతో ఆసక్తికరమైన వార్త.ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఈరోజు (మార్చి 24) సాయంత్రం గ్రాండ్‌గా జరగనుంది.మొదటగా, ఈ ట్రైలర్‌ను IPL 2024 ఓపెనింగ్ సెర్మనీలో రిలీజ్ చేయాలని భావించారు.కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సాధ్యంకాలేదు.

అందుకే, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు.

Telugu Cricket, Davidbhai, David, Hyderabad, Ipl, Mythri Makers, Nithiin, Robin

ఇకపోతే, ఈ కార్యక్రమం కోసం ప్రస్తుతం డేవిడ్ వార్నర్ ఇప్పటికే హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు.ఈ ఈవెంట్‌లో నితిన్, హీరోయిన్ శ్రీలీలతో( heroine Srilieela ) కలిసి అతను ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.మొదట యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించాలని భావించినా, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్ కు మార్చారు.

ఈ ప్రీ-రిసిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని డేవిడ్ వార్నర్ తన అనుభవాలను షేర్ చేసుకుంటాడా? ఫ్యాన్స్‌తో ఇంకెలాంటి ఫన్ చేయనున్నాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా, టాలీవుడ్‌లో భారీ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

నవీన్ ఎర్నేని, ఎలమంచి రవిశంకర్ ఈ చిత్ర నిర్మాతలు.ఈ మూవీ మార్చి 28న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

క్రికెట్ మైదానం నుంచి టాలీవుడ్ వెండితెర వరకు, డేవిడ్ వార్నర్ కొత్త ప్రయాణం తెలుగు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.వార్నర్ స్టైల్, రాబిన్ హుడ్ మాస్ ఎంటర్టైనర్ ఈ కాంబినేషన్ హిట్ అవుతుందా? అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube