ఆ సినిమాలను రీమేక్ చేస్తే తారక్ కు తిరుగులేనట్టే.. యంగ్ టైగర్ ఆలోచన ఏంటో?

టాలీవుడ్ హీరో ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.

 Jr Ntr Ready To Remake Grandfathers Classics But With Conditions Details, Jr Ntr-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.ఆ సంగతి పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో తండ్రులు, తాతలు నటించిన సినిమాలను రీమేక్ చేయడం అంత ఈజీ కాదు.

అభిమానులు మాత్రం ఇలా తాతలు తండ్రులు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలకు రీమేక్ని కోరుకుంటూ ఉంటారు.కానీ మన హీరోలు మాత్రం ఆ సినిమాలకు దూరంగా ఉంటూ కొత్త కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు.

Telugu Aggipidugu, Danaveera, Gundamma Katha, Jr Ntr, Jr Ntr Classic, Rajamouli,

ఇకపోతే సీనియర్లలో నాగార్జున ఏఎన్ఆర్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ దేవదాస్ ని స్ఫూర్తిగా తీసుకుని మజ్ను ట్రై చేసినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేయలేదు.అయితే ఎన్టీఆర్ ఏవైనా తాత నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Ramarao ) సూపర్ హిట్ సినిమాలు రీమేక్ చేయాలనే ఆకాంక్ష ఫ్యాన్స్ లో ఎప్పటి నుంచో ఉంది.యమదొంగతో కొంచెం ట్రై చేసినా పూర్తిగా నెరవేరలదు.ఇక తారక్ సైతం వాటి పట్ల సానుకూలంగానే ఉన్నాడు కానీ అలాని తొందరపడే ఉద్దేశం లేదు.తాత నందమూరి తారకరామారావు తిరుగులేని ముద్రవేసిన పౌరాణిక, ఇతిహాస గాథలు చేయాలని తనకూ ఉందని కాకపోతే సరైన దర్శకుడు, అవకాశం దొరికితే తప్ప చేయనని ఇటీవలే చెప్పినట్టు వచ్చిన వార్త సినీ ప్రియులను ఆలోచనలో పడేసింది.

Telugu Aggipidugu, Danaveera, Gundamma Katha, Jr Ntr, Jr Ntr Classic, Rajamouli,

కొన్ని సంవత్సరాల క్రితం బాహుబలి సమయంలో రాజమౌళి( Rajamouli ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దానవీరశూరకర్ణ( Dana Veera Soora Karna ) లాంటి గ్రాండియర్ ని జూనియర్ ఎన్టీఆర్ తో తీయాలనే కోరికను వెలిబుచ్చాడు.ఆ ముచ్చట యమదొంగతో కొంత తీర్చుకున్నా అది రీమేక్ కిందకు రాదు కాబట్టి సరిపోలేదట.అయితే నిజంగా తారక్ కనక అలా ఎంచుకోవాల్సి వస్తే నటనకు ఛాలెంజ్ విసిరే సర్దార్ పాపారాయుడు, శ్రీ కృష్ణ పాండవీయం, పాండవ వనవాసం, జస్టిస్ చౌదరి, బందిపోటు, అగ్గిపిడుగు, గుండమ్మ కథ, నర్తనశాల లాంటివి ట్రై చేయవచ్చు.

విస్తృతమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది.వందల కోట్ల బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.కాకపోతే ఎంపిక జాగ్రత్తగా ఉండాలి.ఒకవేళ ఈ సినిమాలు చేస్తే కనుక ఎన్టీఆర్కు ఇక తిరుగు లేనట్టే అని చెప్పాలి.

మరి ఈ విషయంలో ఎన్టీఆర్ ఆలోచన ఏ విధంగా ఉందో తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube