మంచి పెరుగు ఇప్పుడు దొరకడం కూడా కష్టమైపోయింది కాని, మన పెద్దవారిని అడిగితే చెబుతారు … అసలు పెరుగు లేకుండా భోజనం ముగించేవారం కాదని.మరి ఇప్పుడో ? వారంలో ఎన్నిరోజులు పెరుగు తింటున్నాం ?
అసలు పెరుగుతో భోజనాన్ని ముగించడం తెలుగు ఇళ్ళలో వందల సంవత్సరాలుగా ఉన్న ఆచారం లాంటిది.అలాంటి మాటలు ఈ కాలం వారికి నచ్చకపోవచ్చు కాని, పెరుగు వలన ఆరోగ్యానికి ఎన్నని ఉపయోగాలు ఉన్నాయో, రోజు పెరుగు ఎందుకు తీసుకోవాలో చెప్పి చూడండి.
* పెరుగులో కాల్షియం, విటమిన్ డి ప్రోటీన్, గట్ బ్యాక్టీరియా ఉంటాయి.
* బిర్యాని సెంటర్స్ లో పెరుగు ఎందుకు ఇస్తారో తెలుసా ? స్పైసీ ఫుడ్ వలన ఒంట్లో జెనరేట్ అయ్యే హీట్ ని పెరుగు న్యూట్రలైజ్ చేస్తుంది.పెప్టిక్ అల్సర్స్ ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
* పెరుగు లో గట్ బ్యాక్టీరియా ఉండటం వలన ఇది క్రీములతో బాగా పోరాడుతుంది.రోగనిరోధకశక్తి పెంచటంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ తో ఇబ్బందిపడే మహిళలకు ఇది ఏంతో ఉపయోగం.యోనిపై ఇన్ఫెక్షన్స్ దాడి చేయకుండా అడ్డుకోవాలంటే పెరుగుని డైట్ లో చేర్చుకోవాలి.
* కాల్షియం ఎక్కువగా ఉండటం వలన పెరుగు ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది.రెగ్యులర్ గా పెరుగు తినేవారికి కీళ్ళనొప్పులు రావడం, దంతాలలో నొప్పులు రావడం తక్కువగా చూసే విషయం.
* కొలెస్టరాల్ లెవెల్స్ తగ్గించటానికి, బ్లడ్ ప్రెషర్ లెవల్స్ తగ్గించడానికి పెరుగు చేసే సహాయం అంతా ఇంతా కాదు.రోజు పెరుగుతో తినాలె కాని, మీ గుండె చాలా బలంగా ఉంటుంది.
* విటమిన్ ఈ, జింక్, ఫాస్ఫరస్ ఉండటం వలన ఇది చర్మ ఆరోగ్యానికి కూడా పనికివస్తుంది.అలాగే స్ట్రెస్ తో బాధపడేవారు పెరుగు ఇన్టేక్ ని పెంచితే అంచి ఫలితాలు ఉంటాయి.