గూగుల్‌లో 6 నెలలు.. ఒక ఇంజనీర్ నేర్చుకున్న 6 విలువైన పాఠాలు ఇవే?

అమెరికాలోని న్యూయార్క్( New York ) గూగుల్( Google ) ఆఫీస్‌లో పనిచేస్తున్న ఆష్నా దోషి( Aashna Doshi ) అనే భారతీయ ఇంజనీర్.ఆరు నెలల్లో తను నేర్చుకున్న కొన్ని విషయాలను తాజాగా లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు.

 Google Techie Lists 6 Lessons From 6 Months On The Job Details, Google Engineer,-TeluguStop.com

ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్( Viral ) అవుతోంది.టెక్ ప్రపంచంలో ఎంతోమంది నిపుణులకు కనెక్ట్ అయ్యేలా ఆమె చెప్పిన ఆ 6 పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం.

1.‘నేను సరిపోను’ అనే భయం నిజమే.

కానీ ఎదుగుదల కూడా అంతే ముఖ్యం:

గూగుల్‌లో అడుగుపెట్టిన కొత్తలో సీనియర్ ఇంజనీర్ల( Senior Engineers ) మధ్య తానెక్కడో తేడాగా ఉన్నానని ఆష్నా ఫీలయ్యారట.కానీ ప్రశ్నలు అడగడం వల్లే నేర్చుకోగలమని త్వరగానే తెలుసుకున్నారు.అంతేకాదు, అక్కడ తెలివైన ఇంజనీర్లే ఎంతో ఓపికగా వాళ్ల జ్ఞానాన్ని పంచుకుంటారని ఆమె గ్రహించారు.

2.సొంత మనుషులు ముఖ్యం:

టెక్నాలజీ ప్రపంచం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా, మనల్ని సపోర్ట్ చేసేవాళ్లు ఉండాలని ఆష్నా చెబుతున్నారు.గూగుల్‌లోని ఉమెన్స్ నెట్‌వర్క్స్, స్టూడెంట్ ప్యానెల్స్‌తో పాటు పోకర్ క్లబ్ లాంటి గ్రూపుల్లో ఆమె కంఫర్ట్‌ని వెతుక్కున్నారు.

ఇలాంటి గ్రూపుల్లో ఉండటం వల్ల మోటివేషన్‌తో పాటు కనెక్టెడ్ ఫీలింగ్ కూడా వచ్చిందట.

Telugu Aashna Doshi, America, Coffee Chats, Googleemployee, Google Engineer, Yor

3.కాఫీ డేట్స్ అస్సలు తక్కువ అంచనా వేయొద్దు:

కొత్త వాళ్లను కలవడం ఆష్నా గోల్డెన్ రూల్స్‌లో ఒకటి.వారానికి కనీసం ఒకటి లేదా రెండుసార్లు క్యాజువల్ కాఫీ మీటింగ్స్‌ పెట్టుకుంటారట.ఇలాంటి చిట్‌చాట్‌ల వల్ల కెరీర్‌కు ఉపయోగపడే సలహాలు, ఊహించని అవకాశాలు కూడా వచ్చాయని ఆమె అంటున్నారు.

4.‘నాది’ అనే భావనతో పనిచేయాలి:

గూగుల్‌లో టాస్క్‌లు పూర్తి చేయడమే కాదు, బాధ్యత తీసుకోవడం కూడా ముఖ్యమంటున్నారు ఆష్నా.ఏదైనా పనిలో క్రిటికల్‌గా ఆలోచించడం, కొత్త ఐడియాలు చెప్పడం, ఆ పనిని సొంతం చేసుకోవడం ఆమె నేర్చుకున్నారు.

ప్రైవసీ, సెక్యూరిటీ రోల్‌లో ఉంటూ చిన్నగా చేసినా పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని ఆమె తెలుసుకున్నారు.

Telugu Aashna Doshi, America, Coffee Chats, Googleemployee, Google Engineer, Yor

5.కోడింగ్ కంటే కమ్యూనికేషనే ముఖ్యం:

కోడింగ్ స్కిల్స్ చాలా అవసరమే కానీ క్లియర్ కమ్యూనికేషన్( Communication ) ఇంజనీర్లను ప్రత్యేకంగా నిలబెడుతుందని ఆష్నా చెబుతున్నారు.టీమ్ మీటింగ్‌లలో తన ఐడియాలను స్పష్టంగా చెప్పడం తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని ఆమె అంటున్నారు.

6.టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతుంది, నేర్చుకోవడం ఆపొద్దు:

టెక్నాలజీలో నేర్చుకోవడం ఎప్పటికీ ఆగదని ఆష్నా గ్రహించారు.కొత్త సెక్యూరిటీ ఛాలెంజ్‌లు, బెస్ట్ ప్రాక్టీసులు, పర్సనల్ స్కిల్స్.ఇలా ప్రతి విషయంలోనూ నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని ఆమె చెబుతున్నారు.

ఆష్నా పోస్ట్ సోషల్ మీడియాలో చాలామందిని ఇన్‌స్పైర్ చేసింది.యూజర్లు కూడా వాళ్ల వర్క్‌ప్లేస్ ఎక్స్‌పీరియన్స్‌లను షేర్ చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube