గూగుల్‌లో 6 నెలలు.. ఒక ఇంజనీర్ నేర్చుకున్న 6 విలువైన పాఠాలు ఇవే?
TeluguStop.com
అమెరికాలోని న్యూయార్క్( New York ) గూగుల్( Google ) ఆఫీస్‌లో పనిచేస్తున్న ఆష్నా దోషి( Aashna Doshi ) అనే భారతీయ ఇంజనీర్.
ఆరు నెలల్లో తను నేర్చుకున్న కొన్ని విషయాలను తాజాగా లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్( Viral ) అవుతోంది.టెక్ ప్రపంచంలో ఎంతోమంది నిపుణులకు కనెక్ట్ అయ్యేలా ఆమె చెప్పిన ఆ 6 పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం.
H3 Class=subheader-style1.‘నేను సరిపోను’ అనే భయం నిజమే.
కానీ ఎదుగుదల కూడా అంతే ముఖ్యం:/h3p
గూగుల్‌లో అడుగుపెట్టిన కొత్తలో సీనియర్ ఇంజనీర్ల( Senior Engineers ) మధ్య తానెక్కడో తేడాగా ఉన్నానని ఆష్నా ఫీలయ్యారట.
కానీ ప్రశ్నలు అడగడం వల్లే నేర్చుకోగలమని త్వరగానే తెలుసుకున్నారు.అంతేకాదు, అక్కడ తెలివైన ఇంజనీర్లే ఎంతో ఓపికగా వాళ్ల జ్ఞానాన్ని పంచుకుంటారని ఆమె గ్రహించారు.
H3 Class=subheader-style2.సొంత మనుషులు ముఖ్యం:/h3p
టెక్నాలజీ ప్రపంచం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా, మనల్ని సపోర్ట్ చేసేవాళ్లు ఉండాలని ఆష్నా చెబుతున్నారు.
గూగుల్‌లోని ఉమెన్స్ నెట్‌వర్క్స్, స్టూడెంట్ ప్యానెల్స్‌తో పాటు పోకర్ క్లబ్ లాంటి గ్రూపుల్లో ఆమె కంఫర్ట్‌ని వెతుక్కున్నారు.
ఇలాంటి గ్రూపుల్లో ఉండటం వల్ల మోటివేషన్‌తో పాటు కనెక్టెడ్ ఫీలింగ్ కూడా వచ్చిందట.
"""/" /
H3 Class=subheader-style3.కాఫీ డేట్స్ అస్సలు తక్కువ అంచనా వేయొద్దు:/h3p
కొత్త వాళ్లను కలవడం ఆష్నా గోల్డెన్ రూల్స్‌లో ఒకటి.
వారానికి కనీసం ఒకటి లేదా రెండుసార్లు క్యాజువల్ కాఫీ మీటింగ్స్ పెట్టుకుంటారట.ఇలాంటి చిట్‌చాట్‌ల వల్ల కెరీర్‌కు ఉపయోగపడే సలహాలు, ఊహించని అవకాశాలు కూడా వచ్చాయని ఆమె అంటున్నారు.
H3 Class=subheader-style4.‘నాది’ అనే భావనతో పనిచేయాలి:/h3p
గూగుల్‌లో టాస్క్‌లు పూర్తి చేయడమే కాదు, బాధ్యత తీసుకోవడం కూడా ముఖ్యమంటున్నారు ఆష్నా.
ఏదైనా పనిలో క్రిటికల్‌గా ఆలోచించడం, కొత్త ఐడియాలు చెప్పడం, ఆ పనిని సొంతం చేసుకోవడం ఆమె నేర్చుకున్నారు.
ప్రైవసీ, సెక్యూరిటీ రోల్‌లో ఉంటూ చిన్నగా చేసినా పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని ఆమె తెలుసుకున్నారు.
"""/" /
H3 Class=subheader-style5.కోడింగ్ కంటే కమ్యూనికేషనే ముఖ్యం:/h3p
కోడింగ్ స్కిల్స్ చాలా అవసరమే కానీ క్లియర్ కమ్యూనికేషన్( Communication ) ఇంజనీర్లను ప్రత్యేకంగా నిలబెడుతుందని ఆష్నా చెబుతున్నారు.
టీమ్ మీటింగ్‌లలో తన ఐడియాలను స్పష్టంగా చెప్పడం తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని ఆమె అంటున్నారు.