కురుల సంర‌క్ష‌ణ‌కు బెస్ట్‌ ప్రోటీన్ హెయిర్ మాస్క్‌లు ఇవే!

కురుల సంర‌క్ష‌ణ‌కు( Hair Care ) ప్రోటీన్ మాస్క్‌లు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి.వారానికి ఒకసారి ప్రోటీన్ హెయిర్ మాస్క్( Protein Hair Masks ) వేసుకోవ‌డం జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది.

 These Are The Best Protein Hair Masks For Hair Care Details, Hair Care, Hair Ca-TeluguStop.com

జుట్టు రాల‌వ‌డం, విరిగిపోవడం, చిట్ల‌డం తగ్గుతాయి.రూట్స్ స్ట్రెంగ్త్ పెరిగి, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

అలాగే హెయిర్ కలరింగ్, స్ట్రైట్‌నింగ్, కేరటిన్ ట్రీట్మెంట్ వల్ల జరిగే నష్టం నుండి జుట్టుకు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంతో, రఫ్ మరియు డ్యామేజ్డ్ హెయిర్ ను రిపేర్ చేయ‌డంలో, జుట్టును ఆరోగ్యంగా మెరిసేలా ప్రోత్స‌హించ‌డంలో కూడా ప్రోటీన్ మాస్క్‌లు తోడ్ప‌డ‌తాయి.ఈ నేప‌థ్యంలోనే కురుల సంర‌క్ష‌ణ‌కు స‌హాయ‌ప‌డే కొన్ని ప్రోటీన్ మాస్క్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Banana, Egg White, Care, Care Tips, Masks, Healthy, Honey, Latest, Milk,

హెయిర్ మాస్క్ 1:

మిక్సీ జార్ లో ఒక కప్పు అరటిపండు ముక్కలు( Banana ) మరియు అరకప్పు పచ్చిపాలు( Milk ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనెను మిక్స్ చేసి జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించాలి.40 నిమిషాల అనంతరం గోరువెచ్చ‌ని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.అర‌టిపండు జుట్టును మృదువుగా మార్చుతుంది.

పాల‌లోని ప్రోటీన్ జుట్టును హెల్తీ అండ్ స్ట్రోంగ్‌గా చేస్తుంది.నువ్వుల నూనె తల చర్మాన్ని పోషిస్తుంది.

Telugu Banana, Egg White, Care, Care Tips, Masks, Healthy, Honey, Latest, Milk,

హెయిర్ మాస్క్ 2:

ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ వైట్‌,( Egg White ) రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) మిక్స్ చేయండి.ఈ మిశ్రమాన్ని తలపై మరియు జుట్టుకు పట్టించుకుని ముప్పై నిమిషాలు ఉంచండి.ఆ త‌ర్వాత షాంపూతో త‌ల‌స్నానం చేయండి.గుడ్డులోని ప్రోటీన్లు జుట్టును దృఢంగా మార్చుతాయి.పెరుగు సహజమైన కండీషనర్‌గా పని చేస్తుంది.మరియు తేనె తేమను అందించి కురులకు మెరుపును తీసుకువస్తుంది.

Telugu Banana, Egg White, Care, Care Tips, Masks, Healthy, Honey, Latest, Milk,

హెయిర్ మాస్క్ 3:

మిక్సీ జార్ లో ఒక కప్పు మెంతి ఆకులను మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న‌ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేసి తలకు పట్టించాలి.40 నిమిషాల అనంతరం హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ ప్రోటీన్ మాస్క్ జుట్టు రాల‌డాన్ని త‌గ్గించి ఒత్తుగా పెరిగేందుకు స‌హాయ‌ప‌డుతుంది.

కొబ్బరి నూనె, పెరుగు జుట్టును మృదువుగా మ‌రియు మాయిశ్చరైజ్డ్‌గా ఉంచుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube