పెదాలు గులాబీ రంగులో మెరుస్తూ కనిపిస్తే ముఖం మరింత అందంగా ఆకర్షణీయంగా మారుతుంది.అందుకే అటువంటి పెదాలను ప్రతి మగువ కోరుకుంటుంది.
కానీ అటువంటి పెదాలు పొందడం ఎలాగో అవగాహన ఉండదు.ఈ క్రమంలోనే లిప్ స్టిక్స్ పై ఆధారపడుతుంటారు.
అయితే కృత్రిమ రంగులు వాడటం వల్ల పెదాల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.కానీ ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కేవలం వారంలో రెండు సార్లు కనుక పాటిస్తే సహజంగానే మీ పెదాలు గులాబీ రంగులో మెరుస్తాయి.
పైగా ఈ రెమెడీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ వైట్ షుగర్ లేదా బ్రౌన్ షుగర్ ( Brown sugar ) వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గులాబీ రేకుల పొడి( Rose Petal Powder ), వన్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్( Glycerin ) మరియు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి( ghee ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకోవాలి.ఆపై వేళ్ల తో సున్నితంగా పెదాలను స్క్రబ్బింగ్ చేసుకోవాలి.కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుని ఆపై వాటర్ తో శుభ్రంగా పెదాలను క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల పెదాలపై ( lips ) పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.కొద్దిరోజుల్లోనే పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.అంతేకాదు ఈ రెమెడీని వారంలో కేవలం రెండు సార్లు కనుక పాటిస్తే పెదాలు తరచూ పగలకుండా ఉంటాయి.
మెరిసే మృదువైన పెదాలు మీ సొంతమవుతాయి.కాబట్టి సహజంగానే పెదాలను గులాబీ రంగులో మెరిపించుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.







