1.కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా
తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఈనెల 21వ తేదీన జరగాల్సి ఉన్నా, దానిని ఈనెల 28వ తేదీకి వాయిదా వేశారు.
2.జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి
మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కు వరద ఉధృతి ఎక్కువగా ఉంది.అధికారులు ప్రాజెక్ట్ కు ఉన్న ఎనిమిది గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు.
3.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
4.ఘనంగా ఆదివాసీ దినోత్సవం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఘనంగా ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు.
5.మాధవ్ పై చర్యలకు టిడిపి ఎంపీ డిమాండ్
వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని , టిడిపి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు.
6.ఎస్వీయూ మూడో సెమిస్టర్ ఫలితాలు విడుదల
తిరుపతి ఎస్వీయూ పరిధిలో మూడో సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి.
7.బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా జుజుల
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా జూజుల శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు.
8.వీఆర్వోల సర్దుబాటు జీవో పై స్టే
రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్వోలను ఇతర శాఖలోకి సర్దుబాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 121 పై హైకోర్టు స్టే విధించింది.
9.తమిళనాడు గవర్నర్ తో రజనీకాంత్ భేటీ
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు గవర్నర్ రవిని కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలు తాజా రాజకీయం అంశాలపై చర్చించినట్టు సమాచారం.
10.తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
11.యూపీ సీఎం ఆదిత్యనాథ్ కు బెదిరింపులు
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చంపేస్తామంటూ లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్ లోని హెల్ప్ లైన్ వాట్సప్ లో బెదిరింపులు వచ్చాయి.దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
12.నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవరాలు అరెస్ట్
స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవరాలు రాజశ్రీ చౌదరిబోస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.జ్ఞానవాసి మసీదులో ఆమె పూజలు చేసేందుకు వెళ్లడంతో ఆమెను అరెస్ట్ చేశారు.
13.టిడిపి ఎంపీలపై విమర్శలు
పోలవరంలో ఎలాంటి నిధులు దుర్వినియోగం జరగలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లి స్పష్టం చేసిందని, కానీ పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాకుండా టిడిపి ఎంపీలు ఆటంకాలు సృష్టిస్తున్నారని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు.
14.మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీ రాజ్ పై కోరుకొండ పోలీస్ స్టేషన్ లో 509,354 డీ సెక్షన్ ల కింద కేసు నమోదు అయింది.ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఈ కేసు నమోదు చేశారు.
15.అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి
నంద్యాల జిల్లా వెలుగోడు అటవీ రేంజ్ పరిధిలోని బండల వాగు సమీపంలో సోమవారం ఓ పెద్ద పులి అనుమానాస్పద స్థితిలో మరణించింది.దీనిపై అటవీ అధికారులు విచారణ చేపట్టారు.
16.ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
17.టీఆర్ఎస్ ఎమ్మెల్యే పై కేసు నమోదు
మానుకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు నమోదు అయ్యింది.ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
18.కేంద్రానికి హరీష్ రావు లేఖ
తెలంగాణ కు తక్షణమే 50 లక్షల వాక్సిన్ లు పంపాలని కోరుతూ కేంద్రానికి టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు.
19.సీపీఐ జాతీయ మహా సభలు
అక్టోబర్ 14 నుంచి 18 వరకు సీపీఐ జాతీయ మహాసభలు జరగనున్నాయి.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,990 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,310
.