ప్రోటీన్ కొరతపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మందిలో కామన్‌గా కనిపించే సమస్య ఇది.కానీ, చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు.
దాంతో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.కండరాల బలహీనత, శరీర ఎదుగుదల లేకపోవడం, గుండె జబ్బులు, మెదడు పని తీరు మందగించడం ఇవన్నీ ప్రోటీన్ లోపం వల్ల వచ్చే సమస్యలే.
అందుకే ప్రోటీన్ లోపాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదు.అయితే శరీరంలో ప్రోటీన్ కొరత ఏర్పడినప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
వాటిని గ్రహించి ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే చురుకుగా, ఆరోగ్యంగా, చలాకీగా ఉండొచ్చని అంటున్నారు నిపుణులు.మరి ప్రోటీన్ లోపించినప్పుడు కనిపించే లక్షణాలు ఏంటో చూసేయండి.
శరీరంలో ప్రోటీన్ తగ్గడం వల్ల నీరసం, ఆలసటతో పాటు అతి ఆకలి సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది.
అలాగే ప్రోటీన్ లోపం వల్ల కండరాలు, ఎముకలు బలహీనంగా మారిపోతాయి.దాంతో కీళ్ల నొప్పులు, కండరాలు నొప్పులు, జాయింట్లు పట్టేయడం, చిన్న చిన్న దెబ్బకే ఎముకలు విరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ప్రోటీన్ కొరత వల్ల ఒత్తిడి, చికాకు, ఆందోళన, తలనొప్పి, తరచూ మూడాఫ్ అవ్వడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
అంతేకాదు, హెయిర్ ఫాల్, చర్మం యొక్క నిగారింపు తగ్గిపోవడం, డ్రై స్కిన్, అధిక బరువు, గోళ్లు విరిగిపోవడం ఇవన్నీ కూడా ప్రోటీన్ లోపం వల్ల కనిపించే లక్షనాలే.
ఒక వేళ ఈ లక్షణాలు మీలోనూ ఉంటే.
ఖచ్చితంగా డైట్లో ప్రోటీన్ ఫుడ్‌ను చేర్చుకోవాలి.బాదం పప్పు, గుడ్డు, పాలు, చికెన్ బ్రెస్ట్, ఓట్స్, పెరుగు, చేపలు, పిస్తా పప్పు, సోయా ప్రోడెక్ట్స్, గుమ్మడి కాయ విత్తనాలు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు వంటి ఆహారాలు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.
కాబట్టి, వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకుంటే.ప్రోటీన్ లోపం పరార్ అవుతుంది.