పుట్టిన రోజు వేడుకలు కొంత మందికి శాపంగా మారుతున్నాయి.రోజురోజుకూ యువత బర్త్ డే సెలెబ్రేషన్స్ పేరిట చేసే హంగామా చివరికి వాళ్ళకే ముప్పు వాటిల్లే లాగా చేస్తుంది.
ఇంతకు ముందు కూడా బర్త్ డే వేడుకల్లో చాలా మందికి రకరకాలుగా ముప్పు వాటిల్లినా కూడా యువతలో మార్పు మాత్రం రావడం లేదు.ఇది వరకు లాగా పుట్టిన రోజు వేడుకలు జరగడం లేదు.
కేకు కట్ చేసిన నెక్స్ట్ మినిట్ లోనే కేకు పుట్టిన రోజు జరుపుకునే వ్యక్తి మొహం మీద ఉంటుంది.ఇది వరకు చక్కగా కేక్ కట్ చేశామా తలా ఇంత కేకు తిన్నామా అనేలాగా ఉండేది కానీ ఇప్పుడు కేక్ తినడానికి అస్సలు వాడడం లేదు.
ఎంత సేపటికి కేక్ మొహం మీద పుసామా అనేట్టుగానే ఉంటుంది కేక్ అంత బర్త్ డే జరుపుకునే వాళ్ళ మీద పూసేసి సెల్ఫీలు దిగితే అదే పార్టీగా మారిపోయింది.
తాజాగా ఒక బర్త్ డే పార్టీలో కూడా ఇలాగె కేక్ కట్ చేయగానే ఆ యువతి మొహం మీద అమాంతం అలాగే పెట్టగానే ఆమె ఒక్కసారిగా అరవడంతో స్నేహితులందరూ షాక్ అయ్యారు.వాళ్ళు చేసిన పని వల్ల ఆ యువతి కంటి చూపును కోల్పోయే పరిస్థితి వచ్చింది.బర్త్ డే పార్టీ సరదాగా సాగిపోతున్న సమయంలో స్నేహితులు చేసిన చిన్న పొరపాటుకు ఆమె కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో పడేసింది.
కేక్ మొహం మీద కొట్టగానే ఆమె నొప్పితో ఒక్కసారిగా అరవడంతో షాక్ అయ్యారు.వెంటనే ఆమెను చుస్తే అప్పటికే కంటి నుండి రక్తం కారుతుంది.స్నేహితులు వెంటనే స్పదించి హాస్పిటల్ కు తరలించడంతో కంటికి పుల్ల గుచ్చుకుందని తెలిపారు.తృటిలో ప్రమాదం తప్పిందని డాక్టర్స్ చెప్పడంతో వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.