ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎన్నో ఎనెన్నో హామీలు ఇస్తూనే ఉంటారు.కాని వాటిని నిలబెట్టుకోవడంలో ప్రతి ఒక్కరు విఫలం అవుతారు.
మన దేశ రాజకీయ చరిత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలుపుకున్న రాజకీయ నాయకుడు ఉండక పోవచ్చు అనేది ఒక మాట.ఎందుకంటే ఎన్నికల సమయంలో గెలిచేందుకు ఎదుటి ప్రత్యర్థిని తక్కువ చేసేందుకు ఎన్నో మాటలు మాట్లాడతారు.ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు.కాని అవన్నీ కూడా చేయడం ఎవరి తరం కాదు.
జాతీయ పార్టీలు మేనిఫెస్టోలు ఏర్పాటు చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని చెత్త బుట్టలో పడేయడం మనం చాలా కామన్‌గా చూస్తూనే ఉన్నాం.ఇక ఎన్నికల సమయంలో ఒక సర్పంచ్ ఇచ్చిన వాగ్దానంను నిలుపుకుంటున్న విధానం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
తెలంగాణలోని ఒక మారుమూల గ్రామానికి ఆయన ఒక సర్పంచ్.అలాంటి సర్పంచ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కూడా ప్రముఖ వ్యక్తి అయ్యాడు.
ఆయన చేస్తున్న గొప్ప పనికి అంతా కూడా ఫిదా అవుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.తెలంగాణ రాష్ట్రం నారాయణ పేట జిల్లాలోని కుమార్ లింగంపల్లికి అరవింద్ రెడ్డి సర్పంచ్.ఈయన ఎన్నికల సమయంలో కొన్ని హామీలు ఇచ్చాడు.
గ్రామాన్ని బాగు చేస్తాను, తప్పకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను అంటూ హామీ ఇవ్వడంతో పాటు గ్రామంలో ఉన్న ఆహార భద్రత కార్డులకు ఇచ్చే బియ్యంను ఫ్రీగా ఇస్తానంటూ ప్రకటించాడు.ఆ డబ్బును తాను చెల్లిస్తానని అన్నాడు.

అరవింద్ రెడ్డి హామీలు నచ్చడంతో ఆ గ్రామ ప్రజలు ఆయన్ను సర్పంచ్‌గా నిలపడం జరిగింది.ఆయన్ను సర్పంచ్‌గా గ్రామస్తులు ఎన్నుకోవడంతో ఇచ్చిన హామీలను నిలుపుకునేందుకు సిద్దం అయ్యాడు.సర్పంచ్ అయిన వెంటనే తాను ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని 380 ఆహార భద్రత కార్డులపై ఇచ్చే 98 క్వింటాళ్ల బియ్యాన్ని తన ఖర్చుతో సరఫరా చేస్తున్నాడు.ఇందుకు గాను ప్రతి నెల ఆయన దాదాపుగా 10 వేల రూపాయలను ఖర్చు చేస్తున్నాడు.
నెలకు అంత ఖర్చుతో అయిదు సంవత్సరాలు కూడా ఆ మొత్తంను ఆయన ఖర్చు చేయబోతున్నాడు.అందుకే ఆ గ్రామస్తులు సర్పంచ్‌ను నీవు దేవుడు సామీ అంటున్నారు.సర్పంచ్ అరవింద్ రెడ్డి గురించి మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియజేయండి.