సాధారణంగా అన్నం ఉడికించిన తర్వాత వచ్చే వాటర్ ను చాలా మంది బయట పారేస్తుంటారు.అయితే నిజానికి ఈ రైస్ వాటర్ లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.
అవి మన చర్మ సౌందర్యానికి ఎంతగానో సహాయపడతాయి.ముఖ్యంగా రైస్ వాటర్ తో ఇప్పుడు చెప్పబోయే విధంగా సీరంను తయారు చేసుకుని రోజు నైట్ వాడితే మీ ముఖం అందంగా మరియు కాంతివంతంగా వెలిగిపోవడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం రైస్ వాటర్ తో సీరంను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే ఒక కప్పు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.అనంతరం రైస్ వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ రైస్ వాటర్ లో పావు టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు వేసి బాగా కలిపి ఒక గంట పాటు వదిలేయాలి.

గంట తర్వాత కలర్ చేంజ్ అయిన రైస్ వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ రైస్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన సీరం సిద్ధమవుతుంది.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
నైట్ నిద్రించే ముందు ముఖానికి ఈ సీరంను అప్లై చేసుకుని నిద్రించాలి.రోజు నైట్ ఈ సీరంను కనుక వాడితే చర్మం కాంతివంతంగా మరియు యవ్వనంగా మారుతుంది.
చర్మంపై ముడతలు, మొటిమలు, మచ్చలు క్రమంగా మాయమవుతాయి.ముఖ చర్మం టైట్ అండ్ బ్రైట్ గా మారుతుంది.
వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.మరియు రైస్ వాటర్ తో తయారు చేయబడిన హోమ్ మేడ్ సీరంను వాడటం వల్ల ముఖం సహజంగానే అందంగా మెరుస్తుంది.
కాబట్టి తప్పకుండా ఈ సీరంను వాడేందుకు ప్రయత్నించండి.







